కేసీఆర్ కు ఇన్ని తలనొప్పులా ? ఇలా అయితే కష్టమే ?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) కు రాజకీయంగా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

ముఖ్యంగా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్( BRS ) పేరుతో జాతీయ పార్టీగా మార్చిన తర్వాత తలెత్తున ఇబ్బందులు, ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ బిజెపితో ఏర్పడిన రాజకీయ వైరం ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ కు తలనొప్పిగా మారింది.

మరోవైపు చూస్తే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.ఈ సమయంలో ప్రజల్లో తిరుగులేని ఆదరణ సంపాదించి, మూడోసారి పార్టీని అధికారంలోకి కచ్చితంగా తీసుకురావాల్సిన పరిస్థితి కేసీఆర్ కు ఏర్పడింది.

తెలంగాణలో ప్రభావం చూపించగలిగితేనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశం ఏర్పడుతుంది.మొన్నటి వరకు తెలంగాణతో పాటు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలమనే నమ్మకాన్ని వేళ్ళబుచ్చిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారట.

దీనికి కారణం వరుసగా పార్టీ కీలక నాయకులంతా వివిధ వివాదాలు, కేసుల్లో ఇరుక్కోవడం, మరోవైపు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, ఇవన్నీ కెసిఆర్ కు తలనొప్పి తెప్పిస్తున్నాయి.

Advertisement

ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత (Kavitha ) పేరు తెరపైకి రావడం, ఇప్పటికే ఒకసారి విచారించడం, రెండోసారి విచారణకు కవిత డుమ్మా కొట్టడంతో, నిజంగానే కవిత కు లిక్కర్ స్కాం వ్యవహారంలో సంబంధం ఉందనే విషయాన్ని ప్రతిపక్షాలు జనాల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ కావడం, ఇక మరోవైపు టిఎస్ పిఎస్సి ప్రశ్నపత్రాలు లీక్ కావడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తప్పు లేకపోయినా, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండడం ఇవన్నీ బీఆర్ఎస్ తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకురాబోతున్నాయని కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు.ఇప్పుడు కవితను కనుక ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే, తెలంగాణలో సానుభూతి అంతంత మాత్రంగానే ఉంటుందనే విషయాన్ని కేసిఆర్ అంచనా వేస్తున్నారు.అందుకే ఈ పరిణామాలు సద్దుమణిగిన తర్వాత మరోసారి సర్వే చేయించి దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కేసిఆర్ భావిస్తున్నారట.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు