అద్భుతమైన ప్రయోజనాలతో స్నాప్‌డీల్‌ BoB క్రెడిట్ కార్డ్ లాంచ్.. రూ.249కే పొందండి..

స్నాప్‌డీల్‌ BoB క్రెడిట్ కార్డ్( Snapdeal BoB Credit Card ) అనే RuPay క్రెడిట్ కార్డ్ తాజాగా లాంచ్ అయింది.

ఇది స్నాప్‌డీల్ షాపింగ్, యూపీఐ పేమెంట్స్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

స్నాప్‌డీల్‌లో తరచుగా షాపింగ్ చేసే, వారి యూపీఐ పేమెంట్స్‌పై రివార్డ్‌లను పొందాలనుకునే వ్యక్తులకు ఇది మంచి ఎంపిక.ఈ కార్డు జారీ చేసిన 30 రోజుల్లోపే కార్డ్ హోల్డర్ రూ.500 విలువైన స్నాప్‌డీల్ వోచర్‌( Snapdeal )ను పొందుతారు.స్నాప్‌డీల్‌లో షాపింగ్ చేయడానికి ఈ వోచర్‌ను ఉపయోగించవచ్చు.

ఈ కార్డు యూపీఐ పేమెంట్స్‌, ఆన్‌లైన్ షాపింగ్, కిరాణా షాపింగ్, డిపార్ట్‌మెంటల్ స్టోర్లపై రివార్డ్ పాయింట్లు కూడా అందిస్తుంది.కార్డ్ హోల్డర్ స్నాప్‌డీల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.100కి 20 రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చు.ఆన్‌లైన్ షాపింగ్, కిరాణా షాపింగ్, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లలో ఖర్చు చేసే ప్రతీ రూ.100కి 10 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.ఈ రివార్డ్ పాయింట్లను క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ కార్డ్‌లు లేదా ట్రావెల్ వోచర్‌ల కోసం రీడీమ్ చేయవచ్చు.ఇతర కేటగిరీలలో వారు ప్రతి రూ.100కి 4 రివార్డ్ పాయింట్లను పొందుతారు.

ఈ కార్డ్ పెట్రోల్ పంపుల వద్ద రూ.400 నుంచి రూ.5,000 వరకు ఇంధన కొనుగోలుపై 1% ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపును కూడా అందిస్తుంది.ఇది కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తుంది.

Advertisement

దీనితో కస్టమర్లు తమ కార్డ్‌ని స్వైప్ చేయకుండా ట్యాప్ చేసి పేమెంట్స్‌ చేసుకోవచ్చు.కార్డుకు మొదటి సంవత్సరం ఫీజు కేవలం రూ.249 కావడం విశేషం.ఇక యాన్యువల్ ఫీజును కూడా రూ.249గానే నిర్ణయించారు.అయితే, మీరు ఫస్ట్-ఇయర్‌లో కార్డుపై రూ.25,000 ఖర్చు చేస్తే ఆ సంవత్సరానికి యాన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు పొందొచ్చు.స్నాప్‌డీల్‌ BoB క్రెడిట్ కార్డు క్రెడిట్ పరిమితి రూ.2 లక్షలు.కార్డుపై వడ్డీ రేటు సంవత్సరానికి 36%గా ఉంటుంది.

కార్డు కోసం దరఖాస్తు చేయడానికి మీకు కనీసం 21 ఏళ్లు ఉండాలి.కనీస వార్షిక ఆదాయం రూ.3 లక్షలు ఉండటం తప్పనిసరి.మీరు యూపీఐ పేమెంట్స్‌( UPI payment )పై తక్కువ ఫీజులు, రివార్డ్‌లు ఆఫర్‌ చేసే క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్లయితే, స్నాప్‌డీల్‌ BoB క్రెడిట్ కార్డ్ ఒకసారి తప్పనిసరిగా చెక్ చేయండి.

Advertisement

తాజా వార్తలు