Snap Chat Sound Creators: మీలో మ్యూజిక్ క్రియేటర్ దాగి ఉన్నారా.. నెలకు రూ.2 లక్షలు మీవే..

చక్కగా సంగీతం వాయించడం వచ్చినా కూడా ఈ రోజుల్లో ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించొచ్చు.యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ప్రజలు తమ మ్యూజిక్ టాలెంట్‌ను చూపించడానికి వేదికగా మారుతున్నాయి.అలాగే ఆకర్షణీయమైన రెవిన్యూ కూడా అందిస్తున్నాయి.కాగా తాజాగా స్నాప్‌చాట్ పేరెంట్ కంపెనీ స్నాప్ ఇండియాలోని ప్రముఖ సౌండ్ క్రియేటర్లకు నెలకు 50,000 డాలర్లు అంటే, రూ.40 లక్షల వరకు డబ్బులు ఇస్తామని ప్రకటించింది.

 Snap Chat Launches Sound Creator Fund For Independent Music Creators In India De-TeluguStop.com

స్నాప్‌చాట్‌లో మ్యూజిక్ లేదా సౌండ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయగల టాప్ సౌండ్ క్రియేటర్స్‌కి అమౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

స్నాప్‌చాట్ Snap 20 పేరుతో 20 మంది భారత సంగీత కళాకారులకు మంత్లీ 2,500 డాలర్ల వరకు పే చేయాలని నిర్ణయించింది.ఆర్టిస్టులకు పేమెంట్స్ చాలా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు DistroKidతో మ్యూజిక్ కంపెనీతో చేతులు స్నాప్ కలిపింది.

‘స్నాప్‌చాట్ సౌండ్స్ క్రియేటర్స్ ఫండ్’ ద్వారా డబ్బులు సంపాదించాలనుకునేవారు గ్రాంట్‌ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయవచ్చు.

Telugu Music Creators, India Music, Snap, Snap Chat Sound, Snapchat, Sound Jobs,

దీనికి అర్హతలు తెలుసుకుంటే 16 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతీయులు మాత్రమే మంత్లీ గ్రాంట్ అందుకోగలరు.ఇండిపెండెంట్ మ్యూజిక్ క్రియేటర్స్‌ డబ్బులు సంపాదించడానికి స్నాప్‌చాట్ తీసుకొచ్చిన ప్రోగ్రాం చక్కగా ఉపయోగపడుతుంది.స్నాప్ లో సౌండ్స్ అనేది వినియోగదారులు వారి స్నాప్‌లకు, వారి సొంత క్రియేషన్‌లకు లైసెన్స్ పొందిన సంగీతాన్ని జోడించడానికి అనుమతించే ఫీచర్.

ఇది భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది, ఇక్కడ వినియోగదారులు తమ స్నాప్‌లను సంగీతంతో మెరుగుపరుస్తారు.అలానే ఇతరులతో సరదాగా కమ్యూనికేట్ చేయగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube