Maha Padayathra : 'మహా పాదయాత్ర ' కు ముగింపు పలికేసినట్టేనా ? 

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి జే ఏసీ పేరుతో ఎప్పటి నుంచో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ ప్రాంతవాసులు.అమరావతిని తప్ప మరి ఏ ప్రాంతాన్ని రాజధానిగా అంగీకరించమని చెబుతూ, ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 Is It The End Of Maha Padayatra , Maha Padayathra, Ap,ap Capital, Vizag Capital-TeluguStop.com

ఇక అమరావతి టు అరసవెల్లి పేరుతో మహాపాదయాత్రను మొదలుపెట్టారు .ఈ యాత్ర ప్రారంభానికి ముందు ఏపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించడంతో చివరకు హైకోర్టు అనుమతి తెచ్చుకొని మరి యాత్రను మొదలుపెట్టారు.యాత్ర మొదట్లో ప్రశాంతంగా నే సాగింది.వేలమంది ఈ మహా పాదయాత్రలో పాల్గొని అమరావతి ఉద్యమాన్ని మరింత హైలెట్ చేశారు.అనేక జిల్లాల మీదగా యాత్ర ముందుకు వెళ్ళింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలోకి ఈ యాత్ర అడుగుపెట్టగానే, పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొంటున్న వారి ఐడి కార్డులను తనిఖీ చేశారు .

కానీ ఎవరి వద్ద పెద్దగా ఐడి కార్డులు లేకపోవడం, అమరావతి ప్రాంతానికి సంబంధం లేని వారే ఎక్కువగా యాత్రలో పాల్గొనడంతో మొదటి నుంచి వైసీపీ చేస్తున్న విమర్శలకు బలం చేకూరింది.నిజమైన అమరావతి రైతులెవరు ఈ ఉద్యమంలో పాల్గొనడం లేదని టిడిపి ఆర్టిస్టులే ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు అంటూ చెప్పిన దానికి వూతం ఇచ్చేలా తనిఖీల్లో బయటపడింది.దీంతో ఈ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అమరావతి జేఏసీ ప్రకటించింది .కానీ యాత్ర ఇప్పటికీ మొదలు కాలేదు.అసలు మొదలు అవుతుందో లేదో తెలియని పరిస్థితి.

కేవలం 600 మందికి మాత్రమే యాత్ర చేసేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో , అమరావతి జేఏసీ డైలమాలో పడినట్లు సమాచారం.

Telugu Ap, Ap Cm Jagan, Chandrababu, Jagan, Maha Padayathra, Vizag, Ysrcp-Politi

అదీ కాకుండా ఈ యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పటికే విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో , తమకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో అమరావతి జేఏసీ నేతలు మహాపాదయాత్ర పై వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ యాత్రను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంలో హైదరాబాదులో సమావేశాలు నిర్వహిస్తూ చర్చించుకుంటున్నారట.కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే .ఈ యాత్ర మళ్లీ ప్రారంభమవుతుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.మొత్తం యాత్ర షెడ్యూల్ 60 రోజులు ప్లాన్ చేశారు.

ఈ మేరకు 40 రోజుల యాత్ర సజావుగా సాగినా, కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని, 600 మంది మాత్రమే యాత్రలో పాల్గొనాలని షరతులు విధించడంతో అమరావతి జేఏసీ ఆలోచనలో పడిందట.ఇప్పటికీ ఈ యాత్ర కొనసాగింపు పై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube