వైరల్: పాముకు చుక్కలు చూపించిన సాలీడు... వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!

సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇప్పుడు ఏ విధంగా వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

స్మార్ట్ ఫోన్స్ ఇపుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉండటం వలన పలు సోషల్ మీడియాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఇక్కడ నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.పాములు వేటాడటాన్ని మీరు చూసే వుంటారు.

పాము, ముంగిస ఫైట్స్ తరచూ చూసే వుంటారు.కానీ, సాలీడు (స్పైడర్), పాము ఫైటింగ్ ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు చూడలేదా? అయితే మీరు ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూడవచ్చు.అవును, తాజాగా పాము, సాలీడు మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

కాగా ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చేస్తోంది.ఈ వీడియో పాతదే అయినప్పటికీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.కాగా ఇది టెక్సాస్‌కి సంబంధించనదని విశ్లేషకులు చెబుతున్నారు.

వీడియో ఒక్కసారి పరిశీలించినట్లయితే ఓ స్పైడర్ కారు టైర్‌పై సాలెగూడును ఏర్పాటు చేయడం ఇందులో చూడవచ్చు.

ఓ సమయంలో అక్కడికి చేరుకున్న పాము దురదృష్టవశాత్తూ వలలో చిక్కుకుంది.పాము అందులో చిక్కుకుని బయటకు రాలేక పోవడం వలన సాలీడు పంట పండింది.పాము సాలీడు పరిమాణం కంటే పెద్దదైనప్పటికీ రెండింటి మధ్య భీకర పోరు జరుగుతుంది.

అక్కడ చిక్కుకున్న తర్వాత పాముకు దాడి చేసే అవకాశం లేకపోవడం వలన సాలీడుపైన దాడిచేయలేకపోతోంది.దీన్ని చూసిన నెటిజన్లు సాలీడు వలలో చిక్కి పాము చనిపోయి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.స్పైడర్, స్నేక్ ఫైట్ వీడియోను wildtrails.in అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అనేకమంది వీక్షిస్తున్నారు.

కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)
Advertisement

తాజా వార్తలు