Snake Caught Slipper: తనపైకి విసిరిన చెప్పును ఎత్తుకుపోయిన పాము.. వీడియో వైరల్

సాధారణంగా పాములు ఎలుకలు, కప్పలు, తొండలను తింటుంటాయి.అలానే ఇవి ఆహారం మాత్రమే తమ నోట కరుచుకొని వెళ్ళిపోతుంటాయి.

మిగతా వస్తువులను ఏవీ ఎత్తుకెళ్ళవు.కానీ తాజాగా ఒక పాము ఒక స్లిప్పర్ లేదా చెప్పును నోట కరుచుకొని ఎస్కేప్ అయింది.

దాంతో ఆ చెప్పుల యజమాని అవాక్కయ్యారు.ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో వైరల్ గా కూడా మారింది.

వైరలవుతున్న వీడియోలో ఒక పెద్ద పాము ఒకరి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.ఆ పాము నేలపై వేగంగా పాక్కుంటూ తమ ఇంటి వైపే వస్తుండటంతో ఆ ఇంటి యజమాని దానిని గద్దాయించింది.

Advertisement

కానీ ఆ పాము అలాగే తమ ఇంట్లోకి వస్తుంటే దానిని ఆపేందుకు తన చెప్పును పాము కేసి విసిరింది.వెంటనే ఉలిక్కిపడ్డ ఆ పాము వెనక్కి వెళ్ళింది.

అనంతరం చెప్పును తన నోట కరుచుకుని అక్కడి నుంచి పరార్ అయింది.ఈ దృశ్యాన్ని చూసి ఆ యజమాని షాక్ అయింది.

నా చెప్పు నాకు ఇవ్వు అంటూ దానిపై ఆమె అరుస్తూ ఉంది.అయినా కూడా ఆ పాము చెప్పు పట్టుకుని వేగంగా పొదల్లోకి వెళ్లిపోయింది.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.ఈ పాము ఆ స్లిప్పర్ తీసుకుపోయింది.నిజానికి దీనికి కాళ్లు కూడా లేవు ఆ చెప్పులు తీసుకెళ్లి ఏం చేస్తుందో ఏమో" అని ఒక ఫన్నీ క్యాప్షన్‌ను కూడా యాడ్ చేశారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

ఈ వీడియోను చూసి నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.కోరలు చెప్పులో దిగడం వల్ల ఇలా జరిగి ఉంటుందేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఈ ఆశ్చర్యకరమైన వీడియోని మీరు కూడా ఓసారి చూసేయండి.

Advertisement

తాజా వార్తలు