నాగు పాముకు ఫేస్ మాస్క్.. అదిరిపోయే ఐడియా!

కరోనా వైరస్.మనుషులను చంపేస్తుంది, అనారోగ్యవంతులను చేస్తుంది బయటకు వెళ్లే సమయంలో ఫేస్ మాస్కు ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి అని అందరూ పదే పదే చెప్పిన ఎంతోమంది పట్టించుకోవడం లేదు.

 Jagityala Man Snake Needs A Face Mask Viral Jagityala Man, Snake Wears A Face M-TeluguStop.com

కరోనా వైరస్ వచ్చిన పోతుందిలే, పెద్ద వైరస్ ఏం కాదు అన్నట్టు ఈ కాలం ప్రజలు వ్యవహరిస్తున్నారు.

అయితే కరోనా వైరస్ కు కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా బలవుతున్నాయి.

జంతువులకు కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని జగిత్యాలలో పాములు పెంచే ఓ వ్యక్తి ప్రజలకు మాస్కులు ధరించండి ధరించండి అని చెప్పి అలసిపోయాడు.

దీంతో తన పాముకే మాస్కు వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించాడు.అంతే వెంటనే తన పాముకు ఫేస్ మాస్కు వేసేశాడు.ఇంకేముంది ఆ పాములు ఆటాకు కూడా మంచి గిరాకీ పెరిగిందట.అది చూసిన కొందరు దాని ఫోటోలు షేర్ చేస్తూ ఆ పామును చూసి అయినా ఫేస్ మాస్క్ ధరించండి అంటూ క్యాప్షన్ పెట్టారు.

దీంతో ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈ విచిత్ర సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం, పైడిమడుగులో చోటు చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube