రిలీజ్ డేట్ దొరకక సతమతమవుతున్న చిన్న హీరోల సినిమాలు ఇవే !

ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కు సిద్దంగా లేకపోయినా కూడా యంగ్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి వెనక్కు తగ్గుతున్నారు.

కరోనా సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు థియేటర్ లు లేకపోవడంతో ఆగిపోయాయి.

ఇప్పుడు అన్నీ సర్ధుమనిగినా ఇప్పుడు కూడా వాటికి లైన్ క్లియర్ కావడం లేదు.దానితో చేసేది ఏమీ లేక మరొక కొత్త డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

పెద్ద సినిమాలు అన్నీ కరోనా తర్వాత వరుసగా థియేటర్ లో విడుదల అవుతూ చిన్న సినిమాలకు గ్యాప్ ఇవ్వడం లేదు.ఇలా యంగ్ హీరోలకు కష్టకాలమే మొదలైంది అనుకోవాలి.

అయితే ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటే అన్ని చిన్న సినిమాలు కలిసి విడుదలకు సిద్దంగా ఉన్నాయి.అందువలన వారిలో వారే మాట్లాడుకుని కొందరు వెనక్కు తగ్గడం మరి కొందరు రిలీజ్ కు దగ్గరౌతున్నారు.

Advertisement

అలా చూసుకుంటే.గడిచిన శుక్రవారం చిన్న సినిమాలు అయిన గాడ్సే, కృష్ణా వృందా విహారి విడుదల అవ్వాల్సింది.

అయితే కొన్ని కారణాలతో అవి పోస్ట్ పోనే అయ్యాయి.దీనితో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా విడుదల అయింది.

ప్రస్తుతం సత్యదేవ్ మరియు నాగశౌర్య లు మరో డేట్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు.అయితే నాగశౌర్య గతంలో చూపిన తెగువ ఇప్పుడు చూపలేకున్నాడు.

ఈ సినిమా మాత్రమే కాకుండా మరో 5 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఇక అఖిల్ ఏజెంట్ సినిమా కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి కన్పించడం లేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అఖిల్ కెరీర్ ఊపందుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే.కానీ షెడ్యూల్ షెడ్యూల్ లుగా షూటింగ్ జరుపుకుంటూ ఆలస్యం అవుతూ ఉంది.

Advertisement

ఈ సినిమా ఆగస్ట్ 12 న రిలీజ్ అవ్వొచ్చు అని తెలుస్తోంది.కానీ ఆ డేట్ లో మరికొన్ని సినిమాలు ఉన్నదున ఇక డేట్ కూడా మారొచ్చు.

ఇక ఈ వారం తర్వాత రానున్న జూలై 1 కూడా పెద్ద పోటీ నెలకొంది.ఆ రోజున రానా, గోపీచంద్ మరియు వైష్ణవ్ తేజ్ సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

ముఖ్యంగా గోపీచంద్ పక్కా కమర్షియల్ మరియు వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాలను రిలీజ్ చేయనున్నారు.ఇక రానా నటించిన విరాటపర్వం కూడా అదే రోజు విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది.

దీనితో ఈ మూడు సినిమాలలో ఎవరు తప్పుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

ఇక కళ్యాణ్ రామ్ మూవీ బింబిసార టీజర్ రిలీజ్ చేసి అంచనాలను పెంచాడు.ఈ సినిమాను ఆగస్ట్ 5 న విడుదల చేయాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాకపోవడం ఫ్యాన్స్ లో నిరాశను కలిగిస్తోంది.

ఇక బింబిసార 2 ను ఎన్టీఆర్ తో తీయాలని ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ విశ్వక్ సేన్ వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.

ప్రస్తుతం ఇతను తాజా సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.ఇక ఈ హీరో లిస్ట్ లో గామి, ఓరి దేవుడా, దాస్ కా దంకి సినిమాలను రిలీజ్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాడు.

ఇక యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మంచి జోరు మీద ఉన్నాడు.ఇతను ఇప్పుడు మూడు సినిమాల్ని లైన్ లో పెట్టాడు.వాటిలో కార్తికేయ 2, 18 పేజెస్ మరియు స్పై సినిమాలు ఉన్నాయి.

అయితే ఇందులో స్పై పాన్ ఇండియా మూవీ గా రానుంది.అయితే ఇందులో రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.

అందులో ఒకటి.కార్తికేయ 2 ను జూలై 22 న విడుదల చేయనుండగా, 18 పేజెస్ కు మాత్రం ఇంకా డేట్ సెట్ అవ్వలేదు.

ఇక నిర్మాత అల్లు అరవింద్ మరో కొడుకు అల్లు శిరీష్.హీరోగా ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాడు.ఏవో కొన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు.

కాగా ఇప్పుడు శిరీష్ ఒక్క సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి రెఢీ అవుతున్నాడు.అల్లు అరవింద్ నిర్మాతగా చేస్తున్న ప్రేమ కాదంటా మూవీ ని చేస్తున్నాడు.

ఇందులో అనూ ఇమ్మనియెల్ హీరోయిన్.ఈ సినిమాకు డేట్ వెతికే పనిలో పడింది మూవీ యూనిట్.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన ఆది.ఇప్పటి వరకు తన కెరీర్ లో కొన్ని సినిమాలు చేసినా తనకంటూ గుర్తింపు రాలేదు.అయినా ఏదో ఒక విధంగా ట్రై చేస్తూనే ఉన్నాడు.

ఇప్పుడు ఈ కుర్ర హీరో చేతిలో 6 సినిమాల వరకు ఉన్నాయట.వీటిలో జంగిల్, కిరాతక, సి ఎస్ ఐ సనాతన్, అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ 1 లాంటి డిఫరెంట్ టైటిల్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి.

అయినా ఒక్కటి కూడా ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేయలేదు.ఇలా కుర్ర హీరు అంతా కూడా తమ తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సరైన విడుదల తేదీల కోసం తంటాలు పడుతున్నారు.

తాజా వార్తలు