జుట్టు ఎక్కువగా రాలడానికి అది కూడా కారణమే.. జాగ్ర‌త్త‌!

జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

కానీ, నేటి కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ (జుట్టు రాలిపోవ‌డం) స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

ఎన్ని జాగ్ర‌త్త‌లు పాటించినా, ఎన్ని షాంపూలు మ‌రియు నూనెలు మార్చినా.హెయిర్ ఫాల్ స‌మ‌స్య మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.

అయితే షాంపూలు, నూనెలు మార్చినంత మాత్ర‌రా హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గుతుంద‌ని అనుకుంటే పొర‌పాటే.ఎందుకంటే, జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.

అందులో నిద్ర‌లేమి కూడా ఓ కార‌ణం.ప్రతి రోజు సరిగా నిద్రపోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

Advertisement

గుండె జ‌బ్బులు, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం, డిప్రెషన్, మ‌ధుమేహం, అల‌స‌ట‌, బ‌రువు పెర‌గ‌డం వంటి ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.అలాగే నిద్ర లేమి వ‌ల్ల హెయిల్ ఫాల్ స‌మ‌స్య‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే ప్ర‌తి రోజు క‌నీసం ఏడు నుంచి ఎనిమిది గంట‌లైనా నిద్ర పోవాలి.అప్పుడే ఆరోగ్యానికి, శిరోజాల‌కు మేలు.

ఇక జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి, ఊడ‌కుండా ఉండ‌డానికి ప్రొటీన్లు ఎంతో అవసరం.కాబ‌ట్టి, ప్రొటీన్లు అధికంగా ఉంటే.

పాలు, పాల ఉత్ప‌త్తులు, చికెన్‌, చేపలు, గుడ్లు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.ఇక జుట్టు రాల‌కుండా ఉండాలంటే ఐర‌న్ కూడా చాలా అవ‌స‌రం.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

గోదుమలు, సజ్జలు, నువ్వులు, బాదం, అటుకులు, తోటకూర, పాల‌కూర‌ వంటివి తీసుకోవాలి.అలాగే ఒత్తిడిని, ఆందోళ‌న‌ని త‌గ్గించుకోవాలి.

Advertisement

అప్పుడే జుట్టు రాల‌డం కంట్రోల్ అవుతుంది.ఇక హెయిల్ ఫాల్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న వారికి మెంతులు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి.ఉదయాన్నే పెరుగుతో సహా పేస్ట్ చేసి తలకు ప‌ట్టించాలి.

అర‌గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.

హెయిల్ ఫాల్ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది.

తాజా వార్తలు