రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో సీతక్క

యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ పార్టీ రథసారథి పీసీసీ అధ్యక్షులు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను రేవంత్ అభిమాన సంఘం అధ్యక్షులు నజీర్ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరి పట్టణంలోని ఆర్బినగర్ లోని నజీర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజా నాయకుడిగా రాజకీయ జీవితం గడుపుతున్న ఎనుముల రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో,అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చకపోగా మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి రాష్ట్ర ప్రజలను కేసీఆర్ తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ వెంట తెలంగాణ ప్రజలందరూ నడవాలని కోరారు.ఏకకాలంలో మునుగోడు ఉప ఎన్నికలు,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేపట్టిన భారత్ జోడోయాత్రను విజయవంతం చేయడంలో రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేశారని కొనియాడారు.

ఈ దేశానికి రాహుల్ నాయకత్వం ఎంత అవసరమో రాష్ట్రానికి రేవంత్ రెడ్డి నాయకత్వం కూడా అంతే అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సైనికుల వలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పని చేయడమే రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయనకు మనం ఇచ్చే నిజమైన బహుమతి అని పేర్కొన్నారు.

Advertisement

ఈ సందర్భంగా సీతక్కకు నజీర్ పట్టు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు.పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి సందడి చేశారు.

కార్యకర్తలకు మిఠాయిలను పంపిణీ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రఫీ ఉద్దీన్,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదాస్ గోవర్ధన్,మొహమ్మద్ వాజిద్,గుర్రం శీను,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్,యూత్ కాంగ్రెస్ నాయకుడు సిహెచ్ విశాల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలిమినేటి కుమార్,మొహమ్మద్ చాంద్, మహమ్మద్ వసీం,మొహమ్మద్ సలీం,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News