ప్రజల హృదయాలను గెలిచి కోట్ల మంది యువతకు స్పూర్తిగా నిలిచిన శిరీష.. రాజకీయాలను మార్చేస్తారంటూ?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను ఫాలో అయ్యేవాళ్లకు శిరీష(బర్రెలక్క) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ప్రచారం అద్భుతంగా చేస్తూ శిరీష ( Sirisha ) ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇప్పటికే శిరీష ఎంతోమంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.ఆర్జీవీ( Ram Gopal Varma ) లాంటి సెలబ్రిటీలు సైతం శిరీషను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తుండగా ఆ పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్నాయి.

శిరీష గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో ( Politics ) విప్లవాత్మక మార్పులను తీసుకొస్తారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శిరీష తనను ఎమ్మెల్యేగా( MLA ) గెలిపిస్తే నిరుద్యోగులకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటానని చెబుతున్నారు.

శిరీష ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి ముందు, వేసిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం గమనార్హం.

Advertisement

శిరీష వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు చేస్తున్నా ఆ విషయాలకు ఆమె ప్రజా జీవితానికి సంబంధం లేదు.రాబోయే రోజుల్లో మరింత మంది సామాన్యులు ఎన్నికల్లో( Elections ) పోటీ చేసే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఇన్ స్టాగ్రామ్ లో సైతం శిరీషకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.

శిరీష పోటీ చేయడం ఇతర పార్టీల అభ్యర్థులను సైతం కంగారు పెడుతోంది.ఎన్నికల్లో డబ్బులు పంచకుండా విజయం సాధిస్తే శిరీష విజయం హాట్ టాపిక్ అవుతోంది.సామాన్య ప్రజల నుంచి శిరీషకు ఊహించని స్థాయిలో స్పందన వస్తుండటం గమనార్హం.

శిరీషకు సామాన్య ప్రజలు తమ వంతు సహాయం చేస్తూ ఆమె ఎన్నికల్లో గెలవడానికి మరింత కృషి చేస్తున్నారు.శిరీషకు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యుల చేత ప్రచారం చేయిస్తుండగా ఆ ప్రచారం ప్రభావం ఆమెపై పెద్దగా పడే అవకాశం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

శిరీషకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు