సోషల్ మీడియా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.ఇలా సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోలు ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలా సోషల్ మీడియా ద్వారా ఇంత పాపులారిటీ అయినటువంటి ఈమె అనంతరం బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశాన్ని కూడా అందుకున్నారు.
ఇక బుల్లితెరపై ఈమెకు నటిగా రాని గుర్తింపు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందారు.
అయితే భారీగా నెగిటివిటీని మూట కట్టుకున్నారు.ఈమె ఇదివరకే శ్రీహాన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం షణ్ముఖ్ జస్వంత్ తోచేసిన రొమాన్స్ కారణంగా పూర్తిస్థాయిలో ప్రేక్షకుల నుంచి నెగిటివిటీ ఎదుర్కొన్నారు.
మరోవైపు షణ్ముఖ జష్వంత్ కూడా దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోయి వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉండటంతో తీవ్రస్థాయిలో వీరిపై విమర్శలు రావడం జరిగింది .
ఇక షణ్ముఖ్ జస్వంత్ సిరి పట్ల వ్యవహరించిన తీరుతో విసిగిపోయిన దీప్తి సునయన ఏకంగా తన లవ్ కు బ్రేకప్ చెప్పుకుంది.అయితే సిరి ప్రియుడు శ్రీహన్ మాత్రం తనని అర్థం చేసుకొని ఇదంతా కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో భాగమే అని తెలుసుకొని వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగా సిరి మాత్రం బయట పెద్ద ఎత్తున తన ప్రియుడి గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సిరి తాజాగా కొన్ని ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఇందులో ఈమె దసరా పండుగ సందర్భంగా భవాని మాల దీక్ష తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన తల్లితో కలిసి దిగినటువంటి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే ఈ ఫోటోలు చూసినటువంటి కొంతమంది నేటిజన్స్ శ్రీహాన్ గెలవాలని భవాని దీక్ష తీసుకున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.