భద్రాద్రి రామయ్యకు అదిరిపోయే గిఫ్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా : భద్రాద్రి సీతమ్మ చెంతకు సిరిసిల్ల చేనేత చీర చేరనుంది.

ఈనెల 17 బుదవారం భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల నుండి సీతమ్మకు పెండ్లి చీర వెళ్లనుంది.

ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణానికి చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఆనవాయితీగా ఇస్తున్నాడు.అయితే ఈ చీరను తన మెదడుకు పదును పెట్టి అద్భుతంగా నేశాడు.

చేనేత మగ్గంపై సీత రాముల కళ్యాణం జరిగే తీరు, చీర అంచులో భద్రాద్రి దేవాయాయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు వచ్చే విధంగా నేశాడు.అలాగే చీర మొత్తం శంకు, చక్ర నామాలతో పాటు బార్డర్లో జైశ్రీరామ్ అనే అక్షరాలు వచ్చే విధంగా తీర్చిదిద్దాడు.

ఆరు రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై హరిప్రసాద్ నేశాడు.ఈ చీర బరువు 800 గ్రాములు ఉండగా, ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలతో నేశాడు.

Advertisement

చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మని నేయడం ఈ చీర విశేషం.ఈ చీరను నేడు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కు చూపించి, సీతారాముల కల్యాణానికి అందిస్తానని హరిప్రసాద్ తెలిపాడు.

గత సంవత్సరం పట్టుపీతాంబరం చీరను నేసి సిరిసిల్ల తరఫున భద్రాద్రి దేవస్థానానికి అందించాడు.

Advertisement

Latest Rajanna Sircilla News