Singer Mangli : పుకార్లను నమ్మొద్దు.. కారు ప్రమాద ఘటనపై సింగర్ మంగ్లీ పోస్ట్?

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సింగర్ మంగ్లీ( Singer Mangli ) ఇటీవల కారు ప్రమాదానికి గురయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.

రంగారెడ్డి జిల్లా నందిగామలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా శంషాబాద్ మండలం తొండుపల్లి బ్రిడ్జి వద్ద డీసీఎం వాహనం మంగ్లీ కారును వెనుక నుంచి ఢీ కొట్టింది.దీంతో మంగ్లీ కారు వెనుక భాగం మొత్తం డామేజ్ అయింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో సింగర్ మంగ్లీ తో పాటు మరో ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నారు ఈ ప్రమాద ఘటనలో( Car Accident ) భాగంగా మంగ్లీ గాయాలు పాలయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇక ఈ ప్రమాదం జరగడానికి కారణం డీసీఎం వాహనం డ్రైవర్ మద్యం తాగి నిద్రమత్తులో ఉండటంవల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.అయితే ఈ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ ప్రమాద ఘటన గురించి సోషల్ మీడియా( Social Media )లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మంగ్లీ ఈ ప్రమాద ఘటన గురించి స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.డియర్ ఆల్.నేను క్షేమంగా ఉన్నాను.నాకు ఏం కాలేదు.

Advertisement

ఇటీవల అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగింది.ప్రచారం అవుతున్న పుకార్లను( Rumors ) నమ్మవద్దు.

మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు ఇట్లు మీ మంగ్లీ అంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు.ఇక ఈమె ఈ పోస్ట్ చేయడంతో ఈమెకు పెద్దగా గాయాలు ఏమీ తగలలేదని స్వల్పగాయలు తగిలాయని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు