సింహ రాశి చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా..?

చలన చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి కొంతమంది నటీనటులు వచ్చి రావడంతోనే బాగానే ఆకట్టుకున్నప్పటికీ అనుకోకుండా సినిమాలకి దూరమై రాజకీయాల్లోకి వచ్చి సెటిల్ అయిన నటీనటులు కూడా చాలా మందే ఉన్నారు.

అయితే ఇందులో తెలుగులో ప్రముఖ దర్శకుడు "వి.

సముద్ర" మరియు స్టార్ హీరో "రాజశేఖర్" కాంబినేషన్ లో తెరకెక్కిన "సింహ రాశి" చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ బ్యూటీ "వింధ్య" కూడా ఈ కోవకే చెందుతుంది.అయితే వింధ్య మొదటగా తమిళంలో "సంఘం" అనే చిత్రం ద్వారా నటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తరువాత మలయాళం, తెలుగు, తదితర భాషలలో నటించింది.అయితే తెలుగులో సింహరాశి చిత్రంలో నటించిన తర్వాత ప్రముఖ స్వర్గీయ నటుడు నందమూరి హరికృష్ణ నటించిన "సీతయ్య" చిత్రంలోని ఓ పాత్రలో కనిపించింది.

కానీ నటి వింధ్య తన చిత్ర కథలు మరియు పాత్రల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.దీంతో అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ గెస్ట్ అప్పియరెన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైంది.

Advertisement
Simharasi Special Song Fame Vindhya Movie Career And Politics, Simharasi, Rani R

ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో తమిళనాడు మాజీ మరియు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ స్థాపించిన "ఏఐ అన్నా డీఎంకే" ( ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెత్ర ఖజంగం ) పార్టీలో చేరి కొంతకాలం పాటు తన సేవలు అందించింది.కానీ 2016 సంవత్సరంలో ముఖ్యమంత్రి మరియు నటి జయలలిత మరణించిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంది.

దీంతో గతంలో పార్టీకి చేసిన చేసిన సేవలను గుర్తించిన పార్టీ గత ఏడాది డిప్యూటీ ప్రచార కార్యదర్శి గా వింధ్య ని నియమించింది.దీంతో ప్రస్తుతం వింధ్య సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లో బాగానే రాణిస్తోంది.

Simharasi Special Song Fame Vindhya Movie Career And Politics, Simharasi, Rani R

ఈ విషయం ఇలా ఉండగా తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 చిత్రాలలో పైగా నటించింది.కానీ ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినిమా కెరీర్ పై పడడంతో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు