స్టీల్, ఇత్తడి, వెండి,బంగారు వస్తువులు మిలమిల మెరవాలంటే సులభమైన చిట్కాలు

వంట చేసినప్పుడు గిన్నెలు మాడటం సహజమే.

మాడిన గిన్నె మాడు వదలాలంటే ఆ గిన్నెలో నీటిని పోసి ఒక నిమ్మచెక్క లేదా నిమ్మరసం వేసి మరిగిస్తే ఆ మాడు తేలికగా వదిలిపోతుంది.

గిన్నెలకు జిడ్డు పడితే ఒక పట్టాన వదలవు.ఆ జిడ్డు తొందరగా వదలాలంటే ఆ గిన్నెలను మజ్జిగతో రుద్ది కడగాలి.

పింగాణీ పాత్రలు మెరవాలంటే మొదట బుడిదతో తోమి ఆ తర్వాత సబ్బు నీటితో కడిగితే కొత్త వాటిలా మెరుస్తాయి.పులుసు,చారు వంటి వంటకాలలో ఉప్పు ఎక్కువ అయితే దానిలో ఒక ఇనుప గరెట పెడితే ఉప్పదనం తగ్గుతుంది.

వెండి పాత్రలు మెరుపు తగ్గకుండా మెరుస్తూ ఉండాలంటే వెండి వస్తువులు భద్రపరిచే బ్యాగ్ లో కర్పూరం వేయాలి.స్టీల్ పాత్రలను మిగిలిపోయిన చారు లేదా కూరలతో తోమితే మెరుస్తాయి.

Advertisement

ఇత్తడి, రాగి పాత్రలలో పులుపుకు సంబందించిన వంటలను వండకూడదు.స్టీల్ పాత్రలు మెరవాలంటే బేకింగ్ సోడాలో నీటిని వేసి పేస్ట్ చేసి తోమితే సరి.వంట చేసినప్పుడు గిన్నెలు మసి అంటుకోకుండా ఉండాలంటే మంట తగిలే చోట సబ్బు నీటిని రాయాలి.శనగపిండిలో నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి.

ఈ పేస్ట్ తో వెండి వస్తువులను తోమితే మెరుస్తాయి.బంగాళాదుంప ఉడికించిన నీటితో వెండి,బంగారు వస్తువులను శుభ్రం చేస్తే మెరుస్తాయి.

తుప్పు పట్టిన కత్తి పీట లేదా చాకును ఉల్లిపాయతో తోమితే తుప్పు వదిలిపోతుంది.స్టీల్ గిన్నెలను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే మెరుస్తాయి.

టీ,కాఫీ మరకలు ఉన్న కప్పులను ఉప్పుతో రుద్దితే సరి.ఇత్తడి,రాగి వస్తువులు చింతపండు,ఉప్పు మిశ్రమంతో తోమితే మిలమిల మెరుస్తాయి.

గేమ్ ఛేంజర్ మూవీలో పవన్ కళ్యాణ్ సాంగ్.. ఆ సాంగ్ కు బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే!
Advertisement

తాజా వార్తలు