యూఎస్‌లో సిక్కు క్యాబ్ డ్రైవర్‌పై దాడి: వారంలో రెండో ఘటన, భగ్గుమంటున్న సిక్కులు

అమెరికాలో భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై అతని ఇంటి ముందే దుండుగులు దాడికి పాల్పడ్డారు.వివరాల్లోకి వెళితే.

కాలిఫోర్నియా రాష్ట్రం రిచ్‌మండ్ హిల్‌టాప్ మాల్ సమీపంలో నివసిస్తున్న 57 ఏళ్ల బల్జీత్ సింగ్ సిద్ధు ఉబెర్‌ క్యాబ్ డ్రైవర్‌గా, మెయిల్ క్యారియర్‌గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో ఆదివారం తన ఇంటి వెలుపల ఆయన కారును పార్కింగ్ చేస్తున్నాడు.

సరిగ్గా ఈ సమయంలో ఓ వ్యక్తి సిద్ధూ వద్దకు వచ్చి లైటర్ అడిగాడు.తన వద్ద లేదని చెప్పడంతో ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.

మరలా కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చిన అతను తన వద్ద 5 డాలర్లు ఉన్నాయని, రైడ్‌కు వెళ్లాలని కోరాడు.దీనిపై స్పందించిన బల్జీత్ తన షిఫ్ట్ ముగిసిందని చెప్పడంతో ఆగంతకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Advertisement

అయితే మూడోసారి తిరిగొచ్చిన అతను బార్బెక్యూ గ్రిల్ కవర్ (నిప్పులపై మాంసపు ముక్కలను కాల్చేందుకు వుపయోగించే చువ్వలు)తో బల్జీత్ తలతో పాటు ఇతర శరీర భాగాలపై పదేపదే కొట్టాడటంతో సిద్ధూ తీవ్రంగా గాయపడ్డారు.

అతని అరుపులు, కేకలతో బల్జీత్ కుటుంబం వెంటనే బయటకి పరిగెత్తుకొచ్చింది.ఈ దాడిని విద్వేషపూరితమైన దాడిగా అతని కుటుంబసభ్యులు వాదిస్తున్నారు.సిక్కు తలపాగా, వస్త్రధారణ కారణంగానే ఆయన దాడికి గురయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బల్జీత్ కుమార్తె గగన్‌జోత్ సిద్దూ తన తండ్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.తన జీవితంలో చూసిన అత్యంత భయంకరమైన సంఘటన ఇదేనని, ఏ కుమార్తె కూడా తన తండ్రిని అటువంటి స్థితిలో చూడలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలోని సిక్కు సమాజానికి కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ సంఘీభావం తెలిపింది.కాగా వారం రోజుల వ్యవధిలో అమెరికాలో సిక్కులపై దాడి జరగడం ఇది రెండో సారి.డిసెంబర్ 5న వాషింగ్టన్‌లో భారత సంతతి సిక్కు క్యాబ్ డ్రైవర్‌ జాత్యహంకార దాడికి గురైన సంగతి తెలిసిందే.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు