పిస్తా కాస్త ఎక్కువగా తింటున్నారా..? కాస్త జాగ్రత్త సుమా..!

పిస్తా తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది.

దీనికి కారణం ఇందులో ఐరన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, విట‌మిన్ B, A, E, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు వీటిలో లభిస్తాయి.

అటువంటి పిస్తా ప‌ప్పులు డైట్‌ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అనేక జ‌బ్బుల‌కు దూరంగా ఉండొవ‌చ్చు.వీటిని తీసుకోవ‌డం వల్ల మొద‌డు షార్ప్‌ గా కూడా ప‌ని చేస్తుంది.

అయితే పిస్తా ప‌ప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.అతిగా తీసుకుంటే మాత్రం కొన్ని స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంది.

ఇందులో ముఖ్యంగా పిస్తా ను ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.అవును, పిస్తా ప‌ప్పు మోతాదుకు మించి తీసుకుంటే అందులో ఉండే కాల్షియం, ఆక్సాలేట్ సిస్టైన్ మూత్ర‌పిండాల్లో పేరుకు పోయి రాళ్లు ఏర్ప‌డేలా ప్రేరేపిస్తాయి.

Advertisement

అలాగే పిస్తా ప‌ప్పును అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రిలో అల‌ర్జీలు త‌లెత్తుతాయి.ముఖ్యంగా ద‌ద్దుర్లు, చ‌ర్మం దుర‌ద పెట్ట‌డం, తుమ్ముళ్లు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

ఒక‌వేళ ఏదైనా అల‌ర్జీతో బాధ ప‌డుతుంటే అలాంటి వారు పిస్తా ప‌ప్పుల‌ను దూరంగా ఉంట‌మే మంచిది.ఎందుకంటే, ఇవి స‌మ‌స్య‌ల‌ను మ‌రింత ఎక్కువ చేస్తాయి.

ఇక సాధార‌ణంగా బ‌రువు త‌గ్గించ‌డంలో పిస్తా ప‌ప్పు బాగా స‌హాయ‌ప‌డాతాయి.కానీ, అదే పిస్తా ప‌ప్పును అతిగా తీసుకుంటే మాత్రం శ‌రీరంలో కొవ్వు పెరిగిపోతుంది.దాంతో బ‌రువు మరింత పెరుగుతారు.

అదేవిధంగా.ఆరోగ్యానికి మంచివి క‌దా అని పిస్తా ప‌ప్పుల‌ను అతిగా తీసుకుంటే మాత్రం క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, అతిసారం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ కూడా ఉంటుంది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

అలాగే లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి.ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఈ సమస్యలు తప్పవు.

Advertisement

తాజా వార్తలు