డీజే టిల్లు 2 ఎక్కడి వరకు వచ్చింది భయ్యా... హీరోయిన్ మ్యాటర్ సెటిల్ అయిందా?

సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన డీజే టిల్లు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అందుకే భారీ అంచనాల నడుమ డీజే టిల్లు 2 ( Dj tillu 2 )సినిమాను రూపొందిస్తున్నారు.

ఆ మధ్య హీరోయిన్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది.ఇప్పటికి కూడా చిత్ర యూనిట్ సభ్యులు హీరోయిన్స్ విషయంలో కాస్త అస్పష్టంగానే ఉంది.

అనుపమ పరమేశ్వరన్‌( Anupama Parameswaran ) హీరోయిన్ గా నటిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా ను ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌ తో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.టిల్లు యొక్క కొత్త యాంగిల్ ను సీక్వెల్‌ లో చూడబోతున్నారు అనే టాక్‌ వినిపిస్తుంది.

Advertisement
Siddu Jonnalagadda Movie Dj Tillu 2 Movie New Update , Dj Tillu 2 , Siddu Jonna

ఇక షూటింగ్ విషయానికి వస్తే సగానికి పైగా పూర్తి అయింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Siddu Jonnalagadda Movie Dj Tillu 2 Movie New Update , Dj Tillu 2 , Siddu Jonna

అంతే కాకుండా డీజే టిల్లు 2 యొక్క అప్‌డేట్‌ విషయంలో కూడా త్వరలోనే ఒక క్లారిటీ రాబోతుంది.హీరో టిల్లు పాత్ర ను పరిచయం చేస్తూ ఒక టీజర్ ను విడుదల చేయడం జరిగింది.ముందు ముందు హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తూ కూడా ఒక వీడియో ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి డీజే టిల్లు 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికి తెల్సిందే.అందుకు తగ్గట్లుగానే సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.సాయి సౌజన్య( Sai Soujanya )నిర్మాతగా ఈ సినిమా తో కచ్చితంగా మంచి కమర్షియల్‌ విజయాన్ని అందుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

డీ జే టిల్లు 2 సినిమా షూటింగ్ ను మే నెలలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు