సమంత, సిద్దు ప్రాజెక్ట్‌ అటకెక్కినట్లేనా?

డీజే టిల్లు సినిమా తో ప్రేక్షకులను అలరించి యూత్ లో ఫాలోయింగ్ దక్కించుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddu jonnalagadda ) ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు టిల్లు మూవీ సీక్వెల్‌ తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణం లో ఒక సినిమా ను చేయబోతున్నట్లుగా సిద్దు జొన్నలగడ్డ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఈ సినిమా కు ముందు నందిని రెడ్డి( Nandini Reddy ) దర్శకత్వం లో సమంతతో కలిసి సిద్దు జొన్నలగడ్డ ఒక సినిమా ను చేయాల్సి ఉంది.కానీ సమంత ( Samantha )ఇప్పట్లో కెమెరా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.అదే సమయం లో నందిని రెడ్డి మరో ప్రాజెక్టు పై బిజీగా మారబోతుంది.

కనుక వారిద్దరి కోసం వెయిట్ చేయడం కంటే తాను కొత్త సినిమా ని మొదలు పెట్టడం కరెక్ట్ అనే ఉద్దేశం తో బొమ్మరిల్లు భాస్కర్ ( Bommarillu Bhaskar )చెప్పిన కథ కు సిద్దు జొన్నలగడ్డ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతుంది.దాంతో సమంత, సిద్దు ల మూవీ పూర్తిగా అటకెక్కినట్లే అంటున్నారు.

Advertisement

అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్థం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు సినిమా( DJ Tillu movie ) తో సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు.

ఆ సక్సెస్ ని కంటిన్యూ చేసే విధంగా వరుసగా సినిమాలు చేయాలని ఉద్దేశంతో కాస్త స్లోగానే మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.అయితే బొమ్మరిల్లు భాస్కర్ ఆ మధ్య పూర్తిగా డల్ అయ్యాడు.ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు.

అలాంటి దర్శకుడి తో ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా అంటే కాస్త రిస్కీ ప్రాజెక్టు అనుకోవాలి.మరి ఈ రిస్కీ ప్రాజెక్టు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు