Suresh Kondeti : సురేష్ కొండేటిపై సీరియస్ కామెంట్స్ చేసిన సిద్ధార్థ్.. నీకు వార్నింగ్ ఇవ్వమనిదంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో సిద్ధార్థ్( Siddharth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హీరో సిద్ధార్థ్ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా బొమ్మరిల్లు.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు సిద్ధార్థ్.ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ హీరోగా సరైన అవకాశాలు లేకపోవడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు.

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన సిద్ధార్థ్ చివరగా తెలుగు ప్రేక్షకులను మహాసముద్రం సినిమాతో పలకరించారు.ఇది ఇలా ఉంటే హీరో సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం చిత్తా.

ఈ సినిమా అక్టోబర్ 6వ తేదీన తెలుగులో విడుదల కానున్న విషయం తెలిసిందే.

Siddharth Funny Warning Journalist Suresh Kondeti Video Goes Viral
Advertisement
Siddharth Funny Warning Journalist Suresh Kondeti Video Goes Viral-Suresh Konde

ఇప్పటికే కన్నడ తమిళ మలయాళ భాషల్లో విడుదల అయింది.ఇక ఈ సినిమా తెలుగులో విడుదల కానున్న సందర్భంగా ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూనే వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు.భాగంగానే తాజాగా హైదరాబాదులో( Hyderabad ) ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.కాగా ఈ ప్రెస్‌ మీట్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

సినిమా ఈవెంట్స్‌లో కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్‌గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి( Senior Journalist Suresh Kondeti ) కూడా హాజరయ్యారు.ఆయన ప్రశ్నలు అడిగేముందే హీరో సిద్ధార్థ్ అతనిపై సీరియస్‌ కామెంట్స్ చేశారు.

మీరు కాస్తా పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని మీకు చెప్పమని నాకు ఇంటర్నెట్‌లో సలహా ఇచ్చారంటూ సిద్ధార్థ్ తెలిపారు.

Siddharth Funny Warning Journalist Suresh Kondeti Video Goes Viral
విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

ఈ సందర్బంగా సిద్ధార్థ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.కొండేటి సురేశ్‌కు ఒక వార్నింగ్.మొత్త ఇంటర్నెట్‌ నీకు వార్నింగ్ ఇవ్వమని చెప్పింది.

Advertisement

ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి.అలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని సలహా ఇచ్చారు.

అయితే నేను వారికి కూడా ఒకటి చెప్పాను.సురేశ్ కొండేటి నా ఫ్రెండ్‌ అయ్యా.

అతనికి రైట్స్ ఉన్నాయి అని చెప్పాను అని నవ్వుతూ చెప్పుకొచ్చారు సిద్ధార్థ్.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు