అమెరికాలో తెలుగు ఎన్నారై ఔదార్యం..ఉచితంగా..

అమెరికాలో కరోన కరాళ నృత్యానికి వేలాది మంది అమెరికన్లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ లో కరోనా ప్రభావం తీవ్రంగా చూపించింది.

న్యూయార్క్ తరువాత అంతగా ప్రభావం చూపించిన ప్రాంతం న్యూజెర్సీ.ఇక్కడ కూడా కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంది.మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అయ్యాయి కూడా.

ఈ క్రమంలో ఇళ్లకే పరిమితమై పోయిన ఎంతో మంది తెలుగు ఎన్నారైలకి.కరోనా భాదితులకి వయో వృద్ధులకి సాయం చేయాలనే ఆలోచనతో నాట్స్ ఉపాధ్యక్షుడు శ్యామ్ నల్లం.

ఆయన సతీమణి శైలజ కలిసి ఉచితంగా మందులు, మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేస్తున్నారు.నాట్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన శ్యామ్ స్థానికంగా ఉన్న తెలుగువారందరికీ చేదోడుగా ఉంటున్నారు.

Advertisement

సహజంగానే సేవా కార్యక్రమాలు చేపట్టే శ్యామ్ కరోనా లాంటి విపత్కర సమయంలో సైతం భాదితులకి సాయం అందిస్తున్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు