స్టార్ హీరోయిన్ దెబ్బకు స్టార్ హీరో మూవీ అట్టర్ ఫ్లాప్.. నిండా ముంచేసిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ( Akshay Kumar )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు మాత్రం సక్సెస్ కావడం లేదు.ఇంకా చెప్పాలంటే వరుస ప్లాపులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు అక్షయ్ కుమార్.

సరైన సక్సెస్ సినిమాను అందుకొని చాలా కాలం అయింది.ఒకప్పుడు వందల కోట్ల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు సరైన బ్రేక్ ఈవెన్ కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు.

సినిమాలో డిజాస్టర్ అవుతున్నా కూడా అక్షయ్ కుమార్ మాత్రం తన సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

Advertisement

ఇటీవల నటించిన సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే సినిమా( Khel Khel Mein )తో మరోసారి ప్రేక్షకులను పలకరించారు.అయితే అక్షయ్ కుమార్ గత సినిమాలు పూర్తిగా ఫ్లాప్ అవడంతో చావు దెబ్బ తిన్న ప్రేక్షకులు ఈసారి పూర్తిగా ముఖం చాటేసారు అని చెప్పవచ్చు.

హీరోయిన్లతో కలిసి గట్టిగా చేసినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు.అయితే ఖేల్ ఖేల్ మే సినిమాకు మొదటి రోజు ఒక మోస్తారు టాక్ వచ్చింది.సినిమా హిట్ అవ్వకపోయినా, అక్షయ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని కొంతమంది అన్నారు.

దీంతో యూనిట్ తో పాటు, అక్షయ్ లో కూడా కాస్త ఆశ చిగురించింది.

అయితే ఆ ఆనందాన్ని ఒక్క రోజు కూడా నిలవనీయలేదు స్త్రీ-2.శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు(S hraddha Kapoor ) నటించిన ఈ సినిమా అక్షయ్ మూవీని పూర్తిగా తొక్కిపడేసింది.మొదటి రోజు అక్షయ్ సినిమాకు కేవలం 5 కోట్ల రూపాయల నెట్ రాగా, స్త్రీ-2 సినిమాకు ఏకంగా రూ.55.40 కోట్లు వసూళ్లు వచ్చాయి.నిన్న ఖేల్ ఖేల్ మే సినిమాకు కేవలం రూ.2 కోట్లు రాగా, స్త్రీ-2 సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.శ్రద్ధా కపూర్ సినిమా రేసులో లేకపోతే అక్షయ్ కుమార్ సినిమా ఫ్లాప్ అయినా, కనీసం మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ఇప్పుడా అవకాశం లేదు.మొత్తంగా చెప్పాలంటే శ్రద్ధా కపూర్ సినిమా అక్షయ్ కుమార్ సినిమాను తొక్కి పడేసిందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు