అక్కినేని ఫ్యామిలీలో ఎవరు చేయని పని చేస్తున్న అఖిల్.. పెళ్లి విషయంలో అలాంటి నిర్ణయం?

అక్కినేని కుటుంబంలో ఇటీవల నాగచైతన్య పెళ్లి సందడి జరిగిన సంగతి మనకు తెలిసిందే.

నాగచైతన్య శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.

ఇక నాగచైతన్య పెళ్లికి ముందే నాగార్జున( Nagarjuna ) అఖిల్( Akhil ) పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అఖిల్ జైనాబ్( Zainab ) అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారని ఈయన సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు తెలియజేశారు.దీంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా అఖిల్ కూడా త్వరలోనే పెళ్లి( Akhil Wedding ) చేసుకోబోతున్న నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అఖిల్ ఇదివరకే శ్రియ భూపాల్( Shriya Bhupal ) అనే అమ్మాయిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వీరి నిశ్చితార్థానికి బ్రేకప్ చెప్పుకున్నారు అప్పటినుంచి సినిమాలలో బిజీ అయినటువంటి అఖిల్ జైనాబ్ అనే యువతీనీ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.ఇక వచ్చే ఏడాదిలోనే వీరి వివాహం జరగబోతుందని నాగార్జున కూడా ఓ సందర్భంలో వెల్లడించారు.

ఇకపోతే అక్కినేని కుటుంబంలో పలువురు హీరోలు మొదట పెళ్లిళ్లు చేసుకొని విడాకులు( Divorce ) ఇవ్వడం తిరిగి రెండో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.ఇక అఖిల్ కూడా ఇదివరకే నిశ్చితార్థం జరుపుకొని బ్రేకప్ చెప్పుకోగా తిరిగి మరోసారి పెళ్లికి సిద్ధమయ్యారు.అయితే ఈయన మాత్రం తన పెళ్లి విషయంలో చాలా విభిన్నంగా ఆలోచించారని ఇప్పటివరకు అక్కినేని కుటుంబంలో ఎవరు కూడా ఇలా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది.

Advertisement

అఖిల్ తన పెళ్లిని హిందూ సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది.జైనాబ్ కుటుంబ సాంప్రదాయాల ప్రకారమే ఈ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు షాక్ అవుతున్నారు.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు