ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి ఏం మాట్లాడినా సంచలనమే అనే సంగతి తెలిసిందే.ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ తన ఆహారపు అలవాట్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
రాంచీలో రాజ్ రప్ప టెంపుల్ ఉంటుందని ఆ ఆలయంలో అమ్మవారికి మేక దానితో అభిషేకం చేస్తారని ఆయన తెలిపారు.అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి నాకు మూడు కిలోల మటన్ ఇచ్చారని వేణుస్వామి చెప్పుకొచ్చారు.
ఆ మటన్ ను నేను ఉన్న రిసార్ట్ లో ఇవ్వగా పాలకూర పప్పులో మటన్ వేసి వండాడని ఆ మటన్ నేను మూడు ముక్కలు తిన్నానని ఆయన తెలిపారు.నేను నాన్ వెజ్ తింటానని తినకూడదని శాస్త్రం ఉందా అని వేణుస్వామి పేర్కొన్నారు.
కొన్ని దేవాలయాల్లో నాన్ వెజ్ ప్రసాదంగా ఇస్తారని ఆయన తెలిపారు.గతంలో ఒకమ్మాయికి విడాకులు అయితే జిల్లా అంతటా చర్చ జరిగేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

గతంలో పార్టీ మేనిఫెస్టో అంటే భగవద్గీత అని ఇప్పుడు దానిని ఎవరూ పాటించడం లేదని ఆయన తెలిపారు.ఇప్పుడు అమ్మాయిలు కూడా సిగరెట్లు తాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారాలని వేణుస్వామి తెలిపారు.అన్ని కులాల వాళ్లను నేను సమానంగా చూస్తానని వేణుస్వామి కామెంట్లు చేశారు.రష్మికకు పూజ చేసిన సమయంలో విమర్శలు చేశారని ఆయన అన్నారు.

రష్మిక హైదరాబాద్ ఇంట్లో ఉన్న సమయంలో పూజలు చేశామని వేణుస్వామి తెలిపారు.రష్మిక రక్షిత్ జాతకం బాలేదని చెప్పి విడిపోవాలని సూచించానని ఆయన పేర్కొన్నారు.రష్మిక లోక్ సభ ఎంపీ అవుతారని నేను చెప్పానని ఆయన తెలిపారు.
చాలామంది హీరోయిన్లకు పూజలు చేశామని ఆయన కామెంట్లు చేశారు.వేణుస్వామి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







