Baad Shah Junior NTR : బాద్ షా రీరిలీజ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ పరువు తీశారా.. ఏం జరిగిందంటే?

వరుస ఫ్లాపుల వల్ల తారక్ కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న సమయంలో శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన బాద్ షా సినిమా ఆయన కెరీర్ కు రిలీఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో బండ్ల గణేష్ కు ఎక్కువ మొత్తం లాభాలు రాలేదు.

 Shocking Facts About Junior Ntr Baad Shah Movie Rerelease Details Here , Junior-TeluguStop.com

అయితే నవంబర్ 19వ తేదీన ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు.

వాస్తవానికి ఏదైనా ప్రత్యేకత ఉన్న సమయంలో పాత సినిమాలను రిలీజ్ చేస్తే ఫలితం ఉంటుంది.

ఎలాంటి స్పెషాలిటీ లేకుండా పాత సినిమాలను రీరిలీజ్ చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.నట్టి కుమార్ బాద్ షా సినిమాను రీరిలీజ్ చేయగా సరైన ప్రమోషన్స్ లేకుండా రీరిలీజ్ చేయడం కూడా ఈ సినిమాపై ప్రభావం చూపిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

బాద్ షా రీరిలీజ్ అయినా చాలామంది తారక్ అభిమానులకు ఈ విషయం తెలియదు.పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రీరిలీజ్ కాగా ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో ఆక్యుపెన్సీ లేకపోవడం తారక్ ఫ్యాన్స్ ఫీలయ్యేలా చేస్తోంది.

తారక్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఇష్టానుసారం సినిమాలను రీరిలీజ్ చెయ్యడం వల్ల ఫలితం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Baad Shah, Bandla Ganesh, Ntr, Natti Kumar, Srinuwaitla-Movie

ఏదైనా సినిమాను రీరిలీజ్ చేస్తే ఆ సినిమాలో నటించిన నటీనటులు, దర్శకనిర్మాతలు ప్రమోషన్స్ చేస్తే ఫలితం ఉంటుందని అలా చేయని పక్షంలో రీరిలీజ్ అయిన సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు నచ్చే అవకాశం లేదని మరి కొందరు చెబుతున్నారు.వర్షం, బాద్ షా రీరిలీజ్ ఫలితాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల రీరిలీజ్ ల సంఖ్య తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube