నా స్థానంలో ఓ స్టార్ కిడ్ ను తీసుకున్నారు.. కృతిసనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కృతిసనన్( Kriti Sanon ) ఒకరు.

ఆదిపురుష్ సినిమా( Adipurush )తో అబవ్ యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని వరుస విజయాలను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

తాజాగా కృతిసనన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1 నేనొక్కడినే( 1 Nenokkadine ) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతిసనన్ కెరీర్ మొదలైంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించకపోయినా కృతి నటనకు మంచి మార్కులు పడ్డాయి.టాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ నా కెరీర్ లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎక్కువగానే వచ్చాయని చెప్పారు.ఈ విషయంలో నేను హ్యాపీ అని ఆమె పేర్కొన్నారు.

Advertisement

మూవీ ఆఫర్ల కోసం డైరెక్టర్లను అడగడం నాకు నచ్చదని కృతిసనన్ పేర్కొన్నారు.మనకు వచ్చిన మూవీ ఆఫర్లలో 100కు 100 శాతం కష్టపడి నటిస్తే కొంతకాలం తర్వాత అయినా ఆఫర్లు వస్తాయని కృతి అన్నారు.

ఆఫర్లు చేజారిపోయిన సమయంలో బాధ కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు.కొన్ని సినిమాల్లో మొదట నన్ను ఎంపిక చేసి నా స్థానంలో స్టార్ కిడ్స్( Star Kids ) ను ఎంపిక చేశారని కృతి వెల్లడించారు.

తెర వెనుక ఏం జరిగిందో నాకు తెలియదని ఆ పాత్రలను వాళ్లు బాగా చేస్తారని దర్శకుడు భావించి ఉండవచ్చని కృతి అన్నారు.ప్రతి ఒక్కరి లైఫ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటాయని అయితే ఏం జరిగినా దాని వెనుక ఒక రీజన్ ఉంటుందని నేను భావిస్తానని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు