ఆ ఒక్క తప్పు వల్లే గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ లో సంచలనాలు సృష్టించలేదా?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా ఒకటి.1991 సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో విజయశాంతి నటించడం గమనార్హం.మాస్ ప్రేక్షకుల్లో చిరంజీవికి ఇమేజ్ పెరగడానికి ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.ఈ సినిమాలో రాజారాం రోల్ లో నటించి చిరంజీవి మెప్పించారు.

 Shocking Facts About Gang Leader Movie Re Release Collections Details, Gang Lead-TeluguStop.com

ఈ మూవీలో “చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను” అనే డైలాగ్ ను చిరంజీవి చెప్పగా ఈ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాలోని భద్రాచలం కొండ సాంగ్ కూడా అంచనాలను మించి హిట్ గా నిలిచింది.తాజాగా గ్యాంగ్ లీడర్ మూవీ రీ రిలీజ్ కాగా ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా రికార్డులు చేస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా ఈ సినిమా విషయంలో జరిగింది.

ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ సినిమా రీరిలీజ్ కాగా ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆనందించాలో బాధ పడాలో మెగా ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు.కొన్ని సెంటర్స్ లో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా మరికొన్ని సెంటర్స్ లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు.గ్యాంగ్ లీడర్ 4కే క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా ఆశించిన రెస్పాన్స్ రాలేదని బోగట్టా.

ఈ సినిమాకు సంధ్య 70 ఎం.ఎంలో హౌస్ ఫుల్ కాగా మిగతా ప్రాంతాల్లో మాత్రం అదే తరహా పరిస్థితి కనిపించకపోవడంతో అభిమానులు సైతం ఫీలవుతున్నారు.సరైన పబ్లిసిటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది.

మెగాస్టార్ సినిమాల రీ రిలీజ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube