ఆ ఒక్క తప్పు వల్లే గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ లో సంచలనాలు సృష్టించలేదా?

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా ఒకటి.

1991 సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో విజయశాంతి నటించడం గమనార్హం.మాస్ ప్రేక్షకుల్లో చిరంజీవికి ఇమేజ్ పెరగడానికి ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.

ఈ సినిమాలో రాజారాం రోల్ లో నటించి చిరంజీవి మెప్పించారు.ఈ మూవీలో "చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను" అనే డైలాగ్ ను చిరంజీవి చెప్పగా ఈ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాలోని భద్రాచలం కొండ సాంగ్ కూడా అంచనాలను మించి హిట్ గా నిలిచింది.

తాజాగా గ్యాంగ్ లీడర్ మూవీ రీ రిలీజ్ కాగా ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా రికార్డులు చేస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా ఈ సినిమా విషయంలో జరిగింది.

"""/" / ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ సినిమా రీరిలీజ్ కాగా ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆనందించాలో బాధ పడాలో మెగా ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు.

కొన్ని సెంటర్స్ లో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా మరికొన్ని సెంటర్స్ లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు.

గ్యాంగ్ లీడర్ 4కే క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా ఆశించిన రెస్పాన్స్ రాలేదని బోగట్టా.

"""/" / ఈ సినిమాకు సంధ్య 70 ఎం.ఎంలో హౌస్ ఫుల్ కాగా మిగతా ప్రాంతాల్లో మాత్రం అదే తరహా పరిస్థితి కనిపించకపోవడంతో అభిమానులు సైతం ఫీలవుతున్నారు.

సరైన పబ్లిసిటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది.మెగాస్టార్ సినిమాల రీ రిలీజ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?