రజనీ, విజయ్, అజిత్ రియల్ హీరోలు కాదా.. నటి కన్నీళ్లతో సాయం కోరినా వాళ్లు కనికరించలేదా?

ప్రతిరోజూ స్టార్ హీరోలు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికాలు తీసుకుంటున్నారని తరచూ వార్తలు వింటూ ఉంటాం.

ఆ వార్తలు అభిమానులకు సైతం ఒకింత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.

అయితే 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోలలో కోటి రూపాయలు కూడా దానం చేయడానికి మనసొప్పని హీరోలే ఎక్కువగా ఉన్నారు.తమిళనాట నటి సింధు మరణంతో రజనీ,( Rajinikanth ) విజయ్, అజిత్ రీల్ హీరోలే కానీ రియల్ హీరోలు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Shocking Facts About Actress Sindhu Death Details Here Goes Viral, Sindhu, Raji

నటి కన్నీటితో సాయం కోరినా వాళ్లు కనికరించలేదని ఒక్కరు సాయం చేసినా ఈరోజు సింధు ప్రాణాలతో ఉండేవారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొన్నిరోజుల క్రితం కోలీవుడ్ ( Kollywood )నటి సింధు బ్రెస్ట్ క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారు.సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి సహాయం అందకపోవడంతో పాటు వైద్య ఖర్చులను భరించలేక సింధు తనువు చాలించారు.

ఆమె మరణం అభిమానులను ఎంతో బాధ పెట్టింది.మంచి మనస్సును కలిగి ఉండి, సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న సింధు ధీన స్థితిలో మరణించడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.

Advertisement
Shocking Facts About Actress Sindhu Death Details Here Goes Viral, Sindhu, Raji

దాదాపుగా మూడేళ్ల క్రితం సింధు తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాను చనిపోతే కూతురు అనాథ అవుతుందని ఇండస్ట్రీకి చెందిన పెద్దలు సహాయం చేయాలని కోరారు.వైద్యం కోసం భారీ మొత్తంలో ఖర్చు కావడంతో సింధు మీడియా ముఖంగా ఆర్థికంగా సహాయం అందించాలని కోరారు.

Shocking Facts About Actress Sindhu Death Details Here Goes Viral, Sindhu, Raji

అయితే రజనీకాంత్, అజిత్, విజయ్ లాంటి పెద్ద హీరోలు కానీ ఇతర హీరోలు కానీ ఆమెకు సహాయం చేయడానికి ఆసక్తి చూపలేదు.ఈ హీరోలలో ఒక హీరో మనస్సు కరిగి సాయం చేసి ఉన్నా సింధు కూతురు ప్రస్తుతం అనాథ అయ్యేవారు కాదు.అజిత్ మేనేజర్ కు సమాచారం ఇచ్చినా ఫలితం లేదని సింధు బ్రతికున్న సమయంలో ఒక సందర్భంలో వెల్లడించారు.

సింధు( Sindhu ) ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు కోరుకుంటున్నారు.భవిష్యత్తులో మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా తమిళ ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు