కన్న తల్లీదండ్రుల చేతిలో మోసపోయా.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన కాంచన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.200కు పైగా తెలుగు సినిమాలలో నటించిన కాంచన స్టార్ హీరోలకు జోడీగా నటించి పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం.

తాజాగా కాంచన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అసలు పేరు వసుంధర అని అన్నారు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా పేరు కాంచనగా మారిందని ఆమె తెలిపారు.బాల్యంలో మాకు డబ్బులు బాగా ఉండేవని ఆ తర్వాత నాన్న అప్పులపాలయ్యారని కాంచన పేర్కొన్నారు.

ఆ సమయంలో నాకు ఉద్యోగం రాగా ఆ ఉద్యోగంతో బిజీ అయ్యానని కాంచన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నెలకు 600 రూపాయలు జీతంగా వచ్చేదని ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లానని సాంప్రదాయ దుస్తులు నాకు ఎక్కువగా నచ్చేవని కాంచన కామెంట్లు చేయడం గమనార్హం.

Shocking Facts About Actress Kanchana Details Here Goes Viral, Actress Kanchana

నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలామంది హీరోలు ప్రయత్నించారని కానీ నేను మాత్రం చలించేదానినని కాంచన చెప్పుకొచ్చారు.మా పిన్ని కొడుకు ఆస్తి మొత్తం దక్కించుకోవాలని ప్రయత్నించాడని కాంచన కామెంట్లు చేశారు.1996 డిసెంబర్ లో ఇంటినుంచి బయటకు వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.అమ్మానాన్న మారతారని భావించానని కానీ వాళ్లు మారలేదని కాంచన వెల్లడించారు.

Shocking Facts About Actress Kanchana Details Here Goes Viral, Actress Kanchana
Advertisement
Shocking Facts About Actress Kanchana Details Here Goes Viral, Actress Kanchana

మా పిన్ని కొడుకును నమ్మి నా తల్లీదండ్రులే నన్ను చీట్ చేశారని కాంచన కామెంట్లు చేశారు.నేను ఇప్పటికీ కోర్టులో ఆస్తులకు సంబంధించి పోరాటం చేస్తున్నానని కాంచన చెప్పుకొచ్చారు.జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధ పడనని ఆమె తెలిపారు.

ఎవరూ లేకపోయినా భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడని కాంచన పేర్కొన్నారు.కాంచన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కన్న తల్లీదండ్రులే కాంచనను మోసం చేశారని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.కాంచనకు ఇప్పటికీ తెలుగు సినిమాలలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు