ప్రముఖ నటుడు విజయ్ కాంత్ మరణానికి అసలు కారణమిదే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలివే!

ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్ ( Vijaykanth )గత కొంతకాలంగా వేర్వేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా తాజాగా కరోనా సోకడంతో చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

విజయ్ కాంత్ అసలు పేరు విజయరాజ్ అలగర్ స్వామి కాగా 150కు పైగా సినిమాలలో ఆయన నటించారు.

శ్వాస సంబంధిత సమస్యల వల్ల విజయ్ కాంత్ మృతి చెందారని వైద్యులు చెబుతుండటం గమనార్హం.

1952 సంవత్సరం ఆగష్టు నెల 25వ తేదీన విజయ్ కాంత్ మధురైలో జన్మించారు. 1990 సంవత్సరం జనవరి నెల 31వ తేదీన ప్రేమలతతో ఆయన వివాహం జరిగింది.తను నటించిన సినిమాలలో 20 కంటే ఎక్కువ సినిమాలలో పోలీస్ ఆఫీసర్ గా( police officer ) నటించి విజయ్ కాంత్ తన నటనతో ఆకట్టుకున్నారు.2015 సంవత్సరంలో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సగప్తం ( Sagaptham )ఆయనకు చివరి మూవీ కావడం గమనార్హం.

విజయ్ కాంత్ మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.27 ఏళ్ల వయస్సులో విజయ్ కాంత్( Vijaykanth ) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.కెరీర్ తొలినాళ్లలో విజయ్ కాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించడం జరిగింది.1984 సంవత్సరంలో విజయ్ కాంత్ నటించిన 18 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.తన సినిమాలలో ఏదో ఒక మెసేజ్ ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకునేవారు.

Advertisement

నిర్మాతలకు నష్టం వస్తే ఆదుకునే విషయంలో ఆయన ముందువరసలో ఉండేవారు.ఒకానొక సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయ్ కాంత్ గట్టి పోటీని ఇచ్చారు.

విజయ్ కాంత్ నటనకు ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనతో విజయ్ కాంత్ రాజకీయాల్లోకి వచ్చారు.2006, 2011 ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ కాంత్ 2016 సంవత్సరంలో ఓటమిపాలయ్యారు.విజయ్ కాంత్ భౌతికంగా మరణించినా ఫ్యాన్స్ హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు