అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుంది ఇప్పటికే పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం అందుకే చేస్తాం అని చెప్పిన నాయకులు అలాగే అధికారంలోకి రాకముందే మేము అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేసి అపోజిషన్ నాయకుల మీద తొడలు కొట్టి సవాళ్లు చేసిన నాయకులు అందరూ ప్రస్తుతం అంతర్మాధనంలో మునిగిపోయారు.అంతేకాదు చాలామంది బీఆర్ఎస్ నాయకుల్లో ఒక టెన్షన్ పట్టుకుంది.
తాము చేసిన భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఎక్కడ బయట పడతాయో అని భయపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మేడ్చల్ మాజీమంత్రి మల్లారెడ్డి ( Mallareddy ) తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఆయన అసెంబ్లీలో కాంగ్రెస్ కి తక్కువ సీట్లు వస్తే కచ్చితంగా మద్దతిస్తాం అని చెప్పడం అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.అంతేకాదు మల్లారెడ్డి తన అవినీతి ఆరోపణలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతోనే కాంగ్రెస్ ( Congress ) లోకి వెళ్లే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడారని భావిస్తున్నారు.
ఇక ఈయన మాత్రమే కాకుండా ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారట.
ఇందులో ఇద్దరు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీళ్ళు ఎన్నో ఆశలతో పార్టీ అధికారంలోకి వస్తే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని అనుకున్నారు.కానీ చివరికి పార్టీ ఓడిపోయింది.దాంతో మొదటిసారి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారట.
మల్కాజ్ గిరి, ఉప్పల్ నియోజకవర్గాల నుండి ఈసారి ఇద్దరు కొత్త అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి( Marri Rajasekhar Reddy ) , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక వీళ్లే కాకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు( MLA Madhavaram Krishna Rao ) , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందా లు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ ఐదుగురిలో ఒక్కరు పార్టీ నుండి జంపైన మిగతా నలుగురు కూడా వెళ్లాలని చూస్తున్నారట.
మరీ ముఖ్యంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు ( Lokhsabha Elections ) రాబోతున్న తరుణంలో ఎన్నికలు ముగిశాక బీఆర్ఎస్ పార్టీ కి ఆ ఎన్నికల్లో వచ్చే సీట్లను బట్టి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.వీళ్లే కాకుండా ద్వితీయశ్రేణి నాయకులు అంటే జడ్పిటిసి, ఎంపిటిసి, ఎంపీపీ, కౌన్సిలర్లు ఇలా చాలామంది కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.