ప్రేమకు ఒప్పుకోకపోతే యాసిడ్ పోసి చంపేయడం లేదంటే కత్తితో పొడిచి హతమార్చడం మగవారికి అలవాటైపోయింది.అన్యాయంగా ఆడబిడ్డలను( Women ) పొట్టన పెట్టుకుంటున్న ఇలాంటి వారిని నడిరోడ్డులో ఉరివేసినా తప్పులేదు.
ఇలాంటి వారికి నేరం రుచి పైన వెంటనే మరణ శిక్ష విధించకపోతే ఆడవారికి సేఫ్టీ ఉండదని చెప్పుకోవచ్చు.తాజాగా పెళ్లి( Marriage ) చేసుకోనందుకు ఒక యువతిని చచ్చిపోయేటట్టు కొట్టిన ఒక యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిని ప్రముఖ వైరల్ వీడియో షేరింగ్ ట్విట్టర్ పేజీ @సీసీటీవీ ఇడియట్స్ పంచుకుంది దీనికి ఇప్పటికే 5 లక్షల 30 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక యువకుడు యువతితో కలిసి ఉండటం మనం చూడవచ్చు.ఆపై అతడు ఆ యువతిని చాలా బలంగా చెంప దెబ్బలు( Slapped ) కొట్టడం మనం గమనించవచ్చు.తర్వాత తల పట్టుకుని నేలమీద పడేశాడు.
అలా కిందపడిపోయిన యువతిని బూటు కాలితో ఘోరంగా తన్నాడు.తర్వాత తలపై కిరాతకంగా మూడుసార్లు తన్నడంతో యువతి అపస్మారక స్థితిలో పడిపోయింది.
ఆమె చనిపోయిందేమో అని భయపడి సదరు యువకుడు వెంటనే ఆమెను లేపాడు.ఆ తర్వాత స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేశాడు కానీ ఆమె స్పందించలేదు దీనితో వీడియో ముగిసింది.ఈ వీడియో చూసి చాలామంది ఆ యువకుడిపై ఫైర్ అవుతున్నారు.ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
అటెంప్టెడ్ మర్డర్ కింద ఆ యువకుడిని బొక్కలోకి తోసి బయటికి రాకుండా చేయాలని మరికొందరు అన్నారు.