సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ శోభాశెట్టి.. అలా చాలాసార్లు మోసపోయామంటూ?

కార్తీకదీపం సీరియల్( Karthika Deepam Serial ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న శోభాశెట్టి బిగ్ బాస్ షో ద్వారా అంతకు మించి పాపులారిటీని పెంచుకున్నారు.

శోభాశెట్టి తాజాగా సొంతింటి కలను నెరవేర్చుకోగా ఆ విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

బిగ్ బాస్ షో( Bigg Boss Show ) వల్ల విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్న శోభాశెట్టి రామ మందిర ప్రారంభోత్సవం రోజున కొత్తింటి తాళం నా చేతికి వచ్చిందని అన్నారు.రెండు సంవత్సరాల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ చూశామని ఆ అపార్టుమెంట్ నచ్చడంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆమె అన్నారు.

అయితే కొన్ని రీజన్ల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయిందని శోభాశెట్టి చెప్పుకొచ్చారు.ఆ సమయంలో మేమిచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదని ఆమె అన్నారు.అలా చాలాసార్లు మోసపోయామని ఆ సమయంలో ఇల్లు కొంటానా? లేదా? అని టెన్షన్ పడ్డానని శోభాశెట్టి అన్నారు.చివరకు సొంతింటే కలను ఎంతో కష్టపడి నెరవేర్చుకున్నానని ఆమె వెల్లడించారు.

బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదని రెండేళ్ల క్రితమే ఈ ఇంటిని కొనుగోలు చేశానని శోభాశెట్టి( Shobha Shetty ) వెల్లడించారు.అయితే ఇంటి తాళం మాత్రం నా చేతికి ఆలస్యంగా వచ్చిందని ఆమె అన్నారు.

Advertisement

ప్రస్తుతం 15వ అంతస్తులో ఉన్న ఉన్న ఫ్లాట్ తీసుకున్నామని ఇంటీరియర్ డిజైనింగ్ కు మరో నాలుగు నెలల సమయం పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాతే ఈ ఇంటికి షిఫ్ట్ అవుతామని శోభాశెట్టి పేర్కొన్నారు.శోభాశెట్టి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social Media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.తెలుగులో మరిన్ని సీరియల్స్ తో శోభాశెట్టి బిజీ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

శోభాశెట్టి రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.శోభాశెట్టి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు