బుల్లితెరపై ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ గురించి, అందులో నటించిన నటీనటుల గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రెటీలను కూడా ఆకట్టుకుంది.
ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ఎంత క్రేజ్ ఉందో మోనిత అనే విలన్ పాత్రకు కూడా అంతే క్రేజ్ ఉండేది.నిజానికి మోనితకు ఈ సీరియల్ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది.
ఈ సీరియల్ తోనే తను మంచి అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది.ఇక ఇటీవలె ఈ సీరియల్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే.గత ఆరు సంవత్సరాలుగా కొనసాగిన ఈ సీరియల్ మొత్తానికి ఇటీవల శుభం కార్డు పలికింది.ఇక ఈ సీరియల్ ముగిసినప్పటికీ కూడా ప్రేక్షకులు మాత్రం ఆ సీరియల్ లోని నటించిన దీప, కార్తీక్, మోనితలను అస్సలు మర్చిపోలేక పోతున్నారు.
ఇక ఇదంతా పక్కన మోనిత తాజాగా ఒక వీడియో పంచుకొని అందులో తన పెళ్లి చూపులు కాలేదు అని షాక్ ఇచ్చింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈమె కన్నడకు చెందిన నటి.ఈమె కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.ప్రస్తుతం తెలుగులో హిట్లర్ గారి పెళ్ళాం, కార్తీకదీపం సీరియల్ లో బిజీగా ఉంది.
ఏ సీరియల్ కు అందుకోనంత గుర్తింపు ఈ సీరియల్ తోనే అందుకుంది శోభా శెట్టి.పైగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇటీవలే తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.
కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఈమె ఫోటోలను రీ పోస్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలానే ఉన్నారు.నిజానికి ఈమె ఫోటోలు పంచుకుంటే చాలు అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.ఇదంతా పక్కన పెడితే తాజాగా యూట్యూబ్లో ఒక వీడియో పంచుకుంది.అందులో తనకు పెళ్లిచూపులు కాలేదు అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.ఇటీవలే ఒక వీడియో షేర్ చేసుకోగా అందులో తన పెళ్లి చూపులు అని తన అభిమానులను నిరాశపరిచింది.
తన తల్లి తన కోసం ఒక అబ్బాయిని చూసింది అని తన పుట్టినరోజున అతడిని చూస్తాను అని తెలిపింది.
అయితే అతను తనకు సెట్ కాలేదు అని.అతడి అభిరుచులు, తమ అభిరుచులు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి అని కొన్ని విషయాలు పంచుకుంది.అందుకే ఆ సంబంధం వదులుకున్నాను అని తెలిపి తన అభిమానులను మళ్లీ సంతోష పెట్టింది.అంతేకాకుండా తన ఇంట్లో జరిగిన పూజను కూడా వీడియోలో చూపించింది.ప్రస్తుతం వీడియో బాగా వైరల్ అవుతుంది.