కీరవాణిని తండ్రి అలా పిలుస్తారా.. అమ్మాయి పేరు పెట్టడానికి కారణమిదేనా?

ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్( Oscar Award ) రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.కిరవాణి( Kiravani) ప్రతిభకు ఎప్పుడో ఆస్కార్ అవార్డ్ రావాలని ఆలస్యంగా ఈ అవార్డ్ వచ్చిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Shivashaktidatta Shocking Comments Goes Viral In Social Media Details Here , Kir-TeluguStop.com

కీరవాణి తండ్రి శివశక్తిదత్తా( Shivashakti Datta ) ఒక ఇంటర్వ్యూలో కీరవాణి గొప్పదనం గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శివశక్తిదత్తా కీరవాణిని చిలక అని పిలుస్తారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివశక్తిదత్తా ఈ విషయాలను వెల్లడించారు.నాటు నాటు సాంగ్( Natu Natu Song ) కు అవార్డ్ రావడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయాయని గోల్డెన్ గ్లోబ్( Golden Globe ) వచ్చిన సమయంలోనే చాలా సంతోషించానని ఆయన తెలిపారు.

ఆస్కార్ వచ్చిందని టీం చెప్పిన వెంటనే చాలా గ్రేట్ అని ఫీలయ్యానని శివశక్తిదత్తా పేర్కొన్నారు.

Telugu Golden Globe, Kiravani, Natu Natu, Oscar Award, Tollywood-Movie

ఆస్కార్ అవార్డ్ వచ్చే ముందురోజు రాత్రంతా మేలుకుని ఉన్నానని ఆయన తెలిపారు.చిలక అని కీరవాణిని పిలుస్తానని అలా పిలవడానికి ప్రత్యేక కారణం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.నేను ఆరు భాషల్లో కవిత్వం రాయగలనని నేను అప్పట్లో మద్రాస్ లో ఉండేవాడినని శివశక్తి దత్తా కామెంట్లు చేశారు.

అప్పట్లో సంగీతం తెలిసినా నాకు రాగాలు తెలియవని ఒక పాట రాగం కీరవాణి అని ఆ పేరు నా పిల్లలకు పెట్టాలని ఫిక్స్ అయ్యానని ఆయన అన్నారు.

Telugu Golden Globe, Kiravani, Natu Natu, Oscar Award, Tollywood-Movie

కీరవాణి పేరు ఆడపిల్ల పేరు అయినప్పటికీ దేవుడు అలా అనిపించాడని భావించి ఆ పేరు పెట్టానని శివశక్తిదత్తా పేర్కొన్నారు.కీరవాణి రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఉందని శివశక్తిదత్తా చెప్పుకొచ్చారు.ఆ కాంబినేషన్ అలా కొనసాగుతోందని శివశక్తిదత్తా వెల్లడించారు.

శివశక్తిదత్తా వయస్సు 91 సంవత్సరాలు కాగా ఆయన ప్రతిభకు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube