వెంకటేష్( Venkatesh ) సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం ఆనందం గా చూస్తారు.ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ వెంకటేష్ సినిమాలో ఉంటాయి ఒక టైం లో ఫుల్ గా డబల్ మీనింగ్ డైలాగ్స్ తో సినిమాలు వచ్చినప్పుడు వెంకటేష్ మంచి ఫ్యామిలీ సినిమాలు తీస్తూ సగటు ప్రేక్షకుడికి తన నుంచి ఎంత వినోదం కావాలో అంత వినోదాన్ని పంచేవాడు… జనాలు తన నుంచి ఎలాంటి సినిమాలు కావాలి అనుకుంటున్నారో అలాంటి సినిమాలే తీసేవాడు…అందుకే ఆయన ఇప్పటికీ ఒక టాప్ హీరోగా మంచి గుర్తింపు పొంది ముందుకు దూసుకెళ్తున్నాడు.

అయితే రానా ( Rana )తో కలిసి వెంకటేష్ చేసిన రానా నాయుడు( Rana Naidu ) వెబ్ సీరీస్ ఈ మధ్య రిలీజ్ అయి తీవ్రమైన విమర్శలను ఎదురుకుంటుంది.ఎందుకంటే ఈ సీరీస్ లో వెంకటేష్ చాలా బూతులు డబల్ మీనింగ్ డైలాగులు చెప్పడంతో సిని అభిమానులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అసలు మనం చూసేది వెంకటేష్ నేనా అనేంతలా ఆశ్చర్యానికి గురిచేశాయి ఆయన మాట్లాడే మాటలు చెప్పే డైలాగులుఆ సీరీస్ చూద్దాం అని కూర్చున్న చాలా మంది ఫ్యామిలీ అభిమానులు వెంకటేష్ మాట్లాడే మాటలు చూసి సినిమా వద్దు, ఏం వద్దు అని కట్ చేసి పడేస్తున్నారు… ఇప్పటివరకు మంచి సినిమాలు తీసిన వెంకటేష్ గారు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయడం అవసరమా అని చాలా మంది ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే తన తదుపరి చిత్రం గా హిట్ సినిమా డైరెక్టర్ అయిన శైలేష్ కొలను దర్శకత్వం లో వస్తున్న సైందవ్ సినిమా ఒక స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ కథ గా వస్తుందని తెలుస్తుంది… ఈ సినిమా కనక హిట్ అయితే అటు వెంకటేష్ కెరియర్ సూపర్ గా ఉంటుంది, ఇటు దర్శకుడు శైలేష్ కొలను కూడా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోవచ్చు… ఏది ఏమైనప్పటికీ వెంకటేష్ ఇప్పటిదాకా మంచి సినిమాలు చేసి ఇప్పుడు రానా నాయుడు లాంటి సినిమాల వల్ల తనకే చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పాలి…ముందుగా ఇలాంటి క్యారెక్టర్ చేయమని ఆయనకి సలహా ఎవరు ఇచ్చారో కానీ అది చాలా తప్పుడు సలహా అనే చెప్పాలి ఎందుకంటే కొందరు హీరోలు అంటే ఇలా ఉంటారు ఆని జనాల మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నారు గత 35 సంవత్సరాలుగా వెంకటేష్ అంటే ఇది ఇలాంటి సినిమాలే చేస్తాడు అని అనుకుంటున్న జనాల అభిప్రాయాన్ని దెబ్బ తీస్తు ఇలాంటి సినిమాలు చేయడం చాలా రాంగ్ అనే చెప్పాలి…








