శివాజీ చిన్న కుమారుడికి ఇంత టాలెంట్ ఉందా... కాలేజ్ టాపారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు శివాజీ (Shivaji) ఒకరు అయితే ఇటీవల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ పలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు.అయితే తాజాగా బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో పాల్గొని 15 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి శివాజీ విన్నర్ అవుతారు అనుకుంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు.

 Shivaji Interesting Comments About His Son Ricky Details, Shivaji Bigg Boss, Ric-TeluguStop.com

ఈ విధంగా శివాజీ బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు.ఇకపోతే ఈయన నటించినటువంటి

Telugu Middleclass, Shivaji, Topper, Ricky, Shivaji Son-Movie

90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్( 90s A Middle Class Biopic ) వెబ్ సిరీస్ ఈటివి విన్ ఓటిటిలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఇలా ఈ వెబ్ సిరీస్ విడుదల కానున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇందులో తొలిప్రేమ సినిమాలో( Tholiprema Movie ) పవన్ కళ్యాణ్ సోదరి శివాజీ భార్యగా నటించగా శివాజీ మాత్రం ముగ్గురు పిల్లల తండ్రిగా ఒక టీచర్ గా ఇందులో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ లో ఒక తండ్రిగా మీరు నటిస్తున్నప్పుడు మీరు నిజ జీవితంలో మీ కొడుకుల పాత్రలకు దగ్గరగా ఉన్నట్టు ఫీలయ్యారా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు శివాజీ సమాధానం చెబుతూ ఇందులో చిన్నపిల్లాడి పాత్ర అచ్చం తన రెండో అబ్బాయి రిక్కీ (Ricky) పాత్రకు చాలా దగ్గరగా ఉందని తెలిపారు.

Telugu Middleclass, Shivaji, Topper, Ricky, Shivaji Son-Movie

ఈ సిరీస్ ట్రైలర్ లో మా చిన్నబ్బాయికి చదువు అంటే ఇష్టం లేదనేలాగా చూపించారు కానీ నిజజీవితంలో మాత్రం నా చిన్న కొడుకుకి చదువు అంటే చాలా ఇష్టమని చాలా టాలెంట్ అంటూ తెలియచేశారు.ప్రస్తుతం తన కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారని, ఫస్ట్ ఇయర్లో తన కొడుకుకు 95% మార్కులు వచ్చాయి అంటూ శివాజీ ఈ సందర్భంగా తన చిన్న కొడుకు టాలెంట్ మొత్తం బయట పెట్టారు.ఒక విధంగా చెప్పాలి అంటే తన కొడుకు పుస్తకాల పురుగు అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube