తెలంగాణలో అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.ఈ మేరకు రేపటి నుంచి అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.అద్దె బస్సులు నడుస్తాయన్న ఆయన వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తామని తెలిపారు.
అదేవిధంగా సంక్రాంతి పండుగకు కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని వెల్లడించారు.అలాగే పండుగ సందర్భంగా స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని ఆయన పేర్కొన్నారు.







