Shivaji Ganesan : నయాగరా ఫాల్స్ కి మేయర్ గా పనిచేసిన ఏకైక సౌత్ హీరో ఇతనే !

అమెరికా లో ఉన్న నయాగరా జలపాతానికి మన హీరో మేయర్ కావడం ఏంటి అని అనుకుంటున్నారా ? మీరు చూస్తుంది నిజమే.

ఆ ఫీట్ సాధించిన ఏకైక హీరో కన్నడ స్టార్ హీరో శివాజీ గణేశన్ ( Shivaji Ganesan ).

ఇక దేశం లో ఫీట్ సాధించిన రెండో వ్యక్తి గా కూడా ఉన్నారు.ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రు.

( Jawahar Lal Nehru ) ఇక అమెరికా కు కెన్నెడి ప్రెసిడెంట్ గా ఉన్న టైం లో ఈ అరుదైన ఘనత మన భారతీయులకు దక్కింది.అయితే శివాజీ గణేశన్ ఒక్క రోజు మేయర్ గా పని చేసి నయాగరా జలపాతానికి( Niagara Falls ) సంబదించిన బంగారు కీ( Key ) ని సిటీ కి తీసుకోచ్చారు.

1963 లో మేయర్ గా ఒకరోజు పని చేసి ఇండియా కు తిరిగి వచ్చిన తర్వాత శివాజీ గణేశన్ కి వెల్ కం చెప్పడానికి వేల సంఖ్యలో జనాలు తరలి రావడం విశేషం.శివాజీ గణేశన్ తో పాటు ఈ అరుదైన ఫీట్ కి ఎంజీఆర్ ( Mgr )కూడా సాక్షిగా ఉన్నారు.ఇక శివాజీ గణేశన్ ఎప్పటికప్పుడు తాను ఇండియన్ అంటూ చెప్పుకోవడానికి ఎల్లప్పుడూ ఇష్టపడేవాడు.

Advertisement

తాను ఎక్కడికి వెళ్లిన కూడా ఇండియన్ గా ఉంటానని చివరగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.మరో వైపు శివాజీ గణేశన్ దానధర్మాలు చేయడం లో కూడా ఎల్లప్పుడూ ముందు ఉండేవారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో మరియు విద్యాభివృద్ధికి అనేక ఆర్థిక సహాయాలు చేశారు.మధ్యాహ్న భోజన పథకం కోసం లక్ష విరాళం కూడా ఇచ్చారు.తంగ పదకం అనే నాటకం వేసి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం కూడా విరాళంగా ఇచ్చేవారు.

పేదరికంలో ఉన్న పి.కక్కన్‌కు ( P.Kakkan )చాల బంగారం కూడా ఇచ్చారు.1965 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో కూడా పెద్ద మొత్తంలో డబ్బును విరాళంగా ఇచ్చాడు.వీరపాండియ కట్టబొమ్మన్ విగ్రహాన్ని అతన్ని ఉరి తీసిన స్థలంలో ఆవిష్కరించాడు.

ఆ ప్రదేశాన్ని తన సొంత డబ్బు తో కొనడం విశేషం.అయన హయాంలో అనేక దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం, ఏనుగులను దానం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.ఇక శివాజీ గణేశన్ లెగసి ని అయన కుమారుడు ప్రభు కొనసాగిస్తున్నారు.1928 లో పుట్టిన శివాజీ గణేశన్ 2001 లో 72 ఏళ్ళ వయసులో కన్ను మూసారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు