బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7( Bigg Boss 7 Telugu ) కంటెస్టెంట్ శివాజీ నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.తన నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయడం అతడికి అలవాటైపోయింది.
అయితే వేరే కంటెస్టెంట్స్ మాత్రం ఇలా మాట్లాడటం లేదు.ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్‌లో వారికి గట్టిగా క్లాస్ పీకుతాడు.
కానీ శివాజీ విషయంలో అలా చేయడం లేదు అందుకే శివాజీ రెచ్చిపోతున్నాడు.ఈ మహారాణులు, మీకు డ్యాష్ డ్యాష్ అని ఇటీవల శివాజీ రోత కూతలు కూశాడు.
ఈ చెత్త మాటలు వీడియోలో చాలా క్లియర్ గా రికార్డయ్యాయి.వాటిని నాగార్జున చూశాడు అయినా శివాజీని పల్లెత్తి మాట కూడా అనలేదు.
లైట్ తీసుకొని పక్షపాత ధోరణి అవలంబించాడు.బూతులు మాట్లాడుతున్నావు ఎందుకు అని అడిగితే సరదాగా అన్నాను సార్ అని నాగార్జున ముందు శివాజీ సింపుల్‌గా అనేసాడు.
దాంతో నాగార్జున( Nagarjuna ) ఏం పట్టించుకోకుండా తాలూపేశాడు.సరదాగా అయినా ఇలాంటి మాటలు అనకుండా ఉండాల్సింది అని పై పైన చెప్పేసి ఆ విషయాన్ని వదిలేసాడు.

ఇక పాస్, ఫెయిల్ అభిప్రాయం సమయంలో కూడా శివాజీ( Shivaji ) రూల్స్ బ్రేక్ చేస్తూ పల్లవి ప్రశాంత చెవిలో ఏదో మాట్లాడాడు అది చూసి నాగార్జున పట్టించుకోనంట్లుగా ఉన్నాడు కనీసం ఎందుకు మాట్లాడుతున్నావ్ అని కూడా అడగలేదు.అంతేకాదు చివరికి శివాజీని హౌస్ కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.ఇందులో ఎంత పక్షపాత ధోరణి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫిజికల్ టాస్క్ పెట్టినట్లయితే అర్జున్( Arjun ) గెలిచి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ.
దానివల్ల శివాజీకి కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉండదు.అందుకని గేమ్ పెట్టకూడదని బిగ్ బాస్ నిర్ణయించుకుంది.
అంతేకాదు అది తమ నిర్ణయం అని చెప్పుకోకుండా హౌజ్ మెట్స్ నుంచి సీక్రెట్ ఒపీనియన్స్ అంటూ ఫేక్ ఆట ఆడారు.అందరూ శివాజీకే ఓటు వేశారు… నాగార్జున కూడా అదే జరగాలి అనుకున్నాడు.
అయితే ఆడియన్స్ ఈ తొండి ఆటను పసిగట్టారు.

కష్టపడకుండా కెప్టెన్( Captaincy Task ) అయిన శివాజీ లాన్‌లోకి వచ్చి ఎంజాయ్ చేశాడు.అతడికి తోక లాగా తిరిగే యావర్, ప్రశాంత్ కూడా దీనిని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే శివాజీకే అందరూ ఓట్లు వేసినప్పుడు వారందరూ సెలబ్రేట్ చేసుకోకుండా వీరి ముగ్గురే సెలబ్రేట్ చేసుకోవడం వల్ల అనుమానాలకి తావిచ్చింది.
బిగ్ బాస్ తీరు గమనిస్తుంటే చివరికి శివాజీకే కప్ ఇచ్చి ఈ షో ముగించేటట్లే ఉన్నారు.