జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలామంది నేతలు టికెట్లు రాక పార్టీలకు రాజీనామా చేసి బయటికి వెళ్లిపోతున్నారు.

 Shettibattula Rajababu Resigns From Janasena Party, Ap Elections, Shettibattula-TeluguStop.com

ఈ రకంగా తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి( TDP Janasena BJP )లో చాలామంది నేతలు టికెట్లు ఆశించి రాకపోవడంతో పలువురు రాజీనామాలు చేయడం జరిగింది.తాజాగా కోనసీమ జిల్లాలో జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది.

విషయంలోకి వెళ్తే జనసేన పార్టీ అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు( Shetty Bathula Rajababu ) రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను జనసేన అధిష్టానానికి పంపారు.

అమలాపురంలో పార్టీకి అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజాబాబు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఎన్నికలలో కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ( Janasena Party ) తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా గణనీయమైన ఓట్లను పొందుకున్నారని పేర్కొన్నారు.ఇక ఈ ఐదేళ్ల కాలంలో జిల్లాలో జనసేన పార్టీ చాలా బలపడిందని తెలియజేశారు.పొత్తులో భాగంగా అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించటంతో స్థానిక జనసైనికుల మనోభావాలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు.

ఇంతకాలం జనసేన జెండాను మోసిన జనసైనికులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జెండా కింద పనిచేయాలని, ఈ మేరకు వారికి అన్యాయం చేసినట్లే అన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.అదేవిధంగా జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పెద్ద పాత్ర పోషించకుండా కేవలం ఒకే ఒక్క నియోజకవర్గానికి పరిమితం కావడం అన్యాయం అన్నారు.

ఈ మేరకు జనసేన పార్టీకి తన క్రియాశీలక సభ్యత్వానికి శెట్టిబత్తుల రాజాబాబు రాజీనామా చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube