రేమో సినిమా ద్వారా తెలుగు ప్రశ్నలకు పరిచయమయ్యారు నటుడు శివ కార్తికేయన్. రేమో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన అనంతరం తను నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా విడుదల చేశారు.
ఇకపోతే తాజాగా అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన చిత్రం ప్రిన్స్.ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.సినిమాలు ఓకే చిత్ర పరిశ్రమకు మాత్రమే కాకుండా ఇతర భాష హీరోలతోనూ దర్శకులతో సినిమాలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.
ఇకపోతే తనకు తెలుగులో చేయాలని ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.

తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సుకుమార్ దర్శకులు అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తన ఫేవరెట్ డైరెక్టర్స్ గురించి ఈయన తెలియజేశారు.ఇలా సుకుమార్, త్రివిక్రమ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పినటువంటి శివ కార్తికేయన్ తనకు అందరిలాగే రాజమౌళి గారి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక ఉందంటూ ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.మరి ఈ యంగ్ హీరో కోరికను రాజమౌళి తీరుస్తారా లేదా తెలియాల్సి ఉంది.