అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన శ్రీదేవి సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది.అందం అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శ్రీదేవి తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ని కూడా తన వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.గ్లామర్ పాత్రలలో కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిద్యమైన సినిమాలలో నటిస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ నటించిన ‘ మిలీ ‘ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులను వేగవంతం చేశారు.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ క్రమంలో యాంకర్ మాట్లాడుతూ మీ చెల్లికి మీరిచ్చే సలహా ఏంటి ? అని ప్రశ్నించగా.ఓ నటుణ్ని మాత్రం ప్రేమించొద్దు’ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.ఒక నటిగా గుర్తింపు పొందిన జాన్వీ ఇలా అదే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ప్రేమించద్దని చెప్పటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన మిలీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా తర్వాత బావాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.ఇలా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న జాన్వీ కపూర్ మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది.ఇక ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే జాన్వీ కపూర్ కేవలం హిందీ సినిమాలలో తప్ప ఇతర ఏ భాషలలోనూ నటించటానికి అంగీకరించటం లేదు
.






