త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శర్వానంద్

టాలీవుడ్ లో ఈ ఏడాది యంగ్ హీరోలు అందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.అలాగే సెలబ్రిటీ కుటుంబాలలో కూడా పెళ్లి వేడుకలు ఎక్కువగా జరుగుతున్నాయి.

పరిస్థితులు అనుకూలించకపోయిన ఉన్న పరిమితులలోనే కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి వేడుకతో హీరోలు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు.ఇప్పటికే యంగ్ హీరోలైన నిఖిల్, నితిన్, రానాలు పెళ్లి చేసుకున్నారు.

ఇక మెగా ఫ్యామిలీ నుంచి నిహారికా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది.అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రీ కొడుకు నటుడు రాజా కూడా ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.

ఇప్పుడు ఈ పెళ్ళైన హీరోల జాబితాలోకి మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా రావడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే తన చిన్న నాటి స్నేహితురాలితో ప్రేమలో ఉన్న శర్వానంద్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

Advertisement

ఆ అమ్మాయి వ్యాపారవేత్తగా ఉందని తెలుస్తుంది.లాక్ డౌన్ సమయంలో వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పడం రెండు కుటుంబాల వారు మాట్లాడుకోవడం జరిగిపోయిందని సమాచారం.

వీలైతే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని, లేదంటే నిశ్చితార్దం చేసుకొని వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి పీటలు ఎక్కాలని అనుకుంటున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని త్వరలో కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్లు బోగట్టా.

ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం అనే మూవీ షూటింగ్ దశలో ఉండగా, అజయ్ భూపతితో మహా సముద్రం, అలాగే మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు.వీటిలో శ్రీకారం మూవీ మీద పాజిటివ్ బజ్ ఉంది.

వరుస ఫ్లాప్ లతో ఉన్న శర్వానంద్ ఈ సినిమాతో మళ్ళీ గాడిలో పడతాడని భావిస్తున్నారు.ఏది ఏమైనా ఈ ఏడాది మన టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లితో కొత్త జీవితం స్టార్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు