వరుసగా ప్లాప్‌ లు పడ్డా రూ.50 కోట్ల బిజినెస్‌ అందుకున్న శర్వా

శర్వానంద్ గత చిత్రాలు వరుసగా నిరాశ పరిచాయి గత రెండు మూడు సంవత్సరాలుగా ఆయన కు సక్సెస్ అనేది లేకుండా పోయింది.

శర్వానంద్ గత చిత్రం మహా సముద్రం తీవ్ర నిరాశ పరిచింది.

ఆ సినిమా కు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన మహా సముద్రం సినిమా నిరాశపరచడం తో శర్వానంద్ అభిమానులు చాలా నిరుత్సాహం వ్యక్తం చేశారు.

శర్వానంద్‌ మంచి సబ్జెక్టు లను సెలెక్ట్ చేసుకుంటాడు అనే ఒక మంచి పేరు ఉంది.కానీ ఆయన ఇలాంటి సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కోవడం తో పాటు అభిమానుల ను దూరం చేసుకుంటున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో ఆయన నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదలకు సిద్ధమైంది.

Advertisement

కిషోర్ తిరుమల దర్శకత్వం లో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.శర్వానంద్ మరియు రష్మిక జోడీ కి మంచి రెస్పాన్స్ దక్కింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ నెల 25 వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించి ప్రీ బిజినెస్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా పాతిక కోట్ల రూపాయలు ఈ సినిమా నిర్మాత కు దక్కినట్లుగా తెలుస్తోంది.

ఇక థియేటర్ల రైట్స్ ద్వారా మరో పాతిక కోట్ల రూపాయలు నిర్మాత కు వచ్చాయి.ప్రీ బిజినెస్ ఇంకా పూర్తి కాకుండానే ఏకంగా 50 కోట్ల రూపాయలు సినిమా దక్కించుకుంది.

నిర్మాత పెట్టిన ఖర్చు కంటే ఇప్పటికే అదనంగా వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా ఫలితంపై శర్వానంద్‌ గత చిత్రాల వరుస ప్లాపులు ప్రభావం చూపించవని బయ్యర్లు భావిస్తున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

అందుకే భారీ మొత్తం పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు