బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.కొంత ఆయన గ్యాప్ తీసుకుంటే, కొంత కరోనా వల్ల వచ్చింది.
మొత్తానికి అయితే జీరో సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ నుంచి కొత్త సినిమా రావడానికి ఏకంగా అయిదు సంవత్సరాలు పట్టింది.ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలి అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా 2023 సంవత్సరం లో మూడు సినిమాలను తీసుకు వచ్చాడు.
సంక్రాంతి సమయంలో పఠాన్ రాగా, మధ్య లో జవాన్ వచ్చింది.తాజాగా డంకీ సినిమా వచ్చింది.
షారుఖ్ ఖాన్ డంకీ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

నేడు విడుదల అయిన డంకీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే రేపు రాబోతున్న సలార్ సినిమా( Salaar movie ) ఫలితం పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే సలార్ సినిమా కు ఎలాంటి ఇబ్బంది లేకుండా డంకీ ఫలితం ఉంది అంటూ రివ్యూలు వస్తున్నాయి.సలార్ సినిమా కు పోటీ అన్నట్లుగా డంకీ లేదు అనేది చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాలా నెలలుగా డంకీ సినిమా వల్ల సలార్ సినిమా వెయ్యి కోట్ల మార్క్ చేరుకోలేక పోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

కానీ ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ సలార్ సినిమా( Salaar movie ) ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్న మేకర్స్ కి మరియు బయ్యర్స్ కి కాస్త ఊపిరి పీల్చుకునే విధంగానే డంకీ సినిమా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.షారుఖ్ ఖాన్ నుంచి వచ్చిన క్లాస్ మూవీ డంకీ సినిమా ను అంతా కూడా ఆధరించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.అంతే కాకుండా మాస్ లో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.
మొత్తానికి ప్రభాస్ అభిమానులు ఎలాంటి టెన్షన్ లేకుండా రేపటి సినిమా విడుదల కోసం వెయిట్ చేయవచ్చు.