రాజ్ కుమార్ హిరాణి( Rajkumar Hirani ) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ), తాప్సీజంటగా విక్కీ కౌశల్( Vicky Kaushal) ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘డంకీ’ సినిమా నేడు డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే మాత్రమే విడుదల అయ్యింది.మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ద్వారా షారుక్ ఖాన్ హిట్ అందుకున్నారా లేదా ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.
కథ:
మను(తాప్సి)( Taapsee Pannu ) , బుగ్గు(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) పంజాబ్ లోని ఓ మారుమూల గ్రామంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవిస్తూ ఉంటారు.వీళ్ళు ఎలాగైనా లండన్ వెళ్లి మంచిగా డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటారు.
అయితే వీరికి చదువు లేకపోవడంతో ఫేక్ వీసా కన్సల్టెన్సీలను నమ్మి మోసపోయిన టైంలో జవాన్ అయిన హార్డీ(షారుఖ్ ఖాన్) తనని కాపాడిన మను వాళ్ళ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్దామని ఆ ఊరు వస్తాడు.అయితే అప్పటికే మను వాళ్ళ అన్నయ్య చనిపోతారు ఆ సమయంలోనే వీరందరూ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను చూసి హార్డీ వారిని ఎలాగైనా లండన్ పంపించాలని భావిస్తారు.
ఇక వీరందరూ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకుని వీసా తెచ్చుకొని లండన్ వెళ్లారంటారు అయితే వీరిలో బల్లి మాత్రమే వీసా పొందుతారు మిగిలిన ఎవ్వరికి వీసా రాదు.
మరోవైపు ఇష్టం లేని పెళ్లి చేసినందుకు తన ప్రియురాలిని ఇంగ్లాండ్ నుంచి కాపాడి తీసుకొద్దామనుకున్న సుఖీ(విక్కీ కౌశల్) వీసా రిజెక్ట్ అవ్వడం, తన ప్రియురాలు చచ్చిపోయిందని ఇంగ్లాండ్ వెళ్లిన బల్లి చెప్పడంతో అతను ఆత్మహత్య చేసుకుంటాడు.
అయితే వీసా రావడానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు అని బాధపడతారు అయితే వీసా రాకుండానే వీరు దొంగగా ఇతర దేశాలకు ప్రయాణం అవుతూ ఉంటారు మరి ఇంగ్లాండ్లో వీళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి మను హర్ది ఎలా కలుస్తారో వీరు ఆర్థిక ఇబ్బందులు ఎలా తీరిపోయాయి అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాలి.

నటీనటుల నటన:
షారుఖ్ ఖాన్. హార్డీ పాత్రలో ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించి, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్లో అందరిని ఏడిపించాడు.ఇక ఈయన 50 సంవత్సరాల వయసుగల పాత్రలో కూడా నటి బాగా నటించారు.
మరోవైపు తాప్సి యంగ్ అండ్ ఓల్డ్ ఏజ్ పాత్రలో కూడా అద్భుతంగా నటించారు.విక్కీ కౌశల్ గెస్ట్ రోల్ కూడా ఆకట్టుకుని ఇతర నటీనటులు అందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్
: స్టార్ హీరో సినిమా కాబట్టి నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉంటాయి. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణిలే నిర్మాతలు.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండవు.ఎక్కువగా ఎమోషనల్ డ్రామా మీదే నడవడంతో అమన్ పంత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు అనిపిస్తుంది.

విశ్లేషణ:
మొదటి హాఫ్ అంతా ఓ పల్లెటూళ్ళో లండన్ వెళ్ళాలి అనే ఆశలతో ఉన్న వాళ్ళతో కామెడీ నడిపించారు.ప్రీ క్లైమాక్స్ లో విక్కీ కౌశల్ పాత్ర ఆత్మహత్యతో సినిమా చాలా ఎమోషనల్ గా కొనసాగుతూ అందరి చేత కంటతడి పెట్టించారు.సెకండ్ హాఫ్ అంతా అక్రమంగా దేశాలు దాటేటప్పుడు వాళ్ళు పడ్డ బాధలు అన్ని చూపిస్తారు.సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గానే సాగుతుంది.అయితే ఈ కథ అంతా ఫ్లాష్ బ్యాక్ గా చూపిస్తారు.ఓ 50 ఏళ్ళ వయసులో షారుఖ్, తాప్సి, మిగిలిన వాళ్ళతో కథని మొదలుపెట్టి 25 ఏళ్ళు వెనక్కి వచ్చి వారి కథను చెబుతారు.మొత్తానికి సినిమా నవ్విస్తూనే ప్రేక్షకులను ఏడిపించేసేలా ఉంది అని చెప్పాలి
ప్లస్ పాయింట్స్:
కథ, నటీనటుల నటన, కామెడీ,ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూసిన విధంగానే ఉన్నాయి.
బాటమ్ లైన్:
షారుఖ్ ఖాన్ గత సినిమాల్లో యాక్షన్ తో మెప్పిస్తే ఈ సారి రాజ్ కుమార్ హిరాణి( Rajkumar Hirani ) మార్క్ ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకులని అక్కట్టుకుంది.







