తెలంగాణ ప్రభుత్వ తీరుపై షర్మిల విమర్శనాస్త్రాలు

తెలంగాణ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన షర్మిల మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపించారు.తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు.

పోలీసులను వాడుకుని తమను అడ్డుకుంటున్నారని తెలిపారు.తాను ఎవరిపై దాడి చేయలేదని, మహిళా పోలీసులే తనపై దాడి చేశారని షర్మిల తెలిపారు.

తనను పరామర్శించేందుకు వచ్చిన తన తల్లిపై కూడా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.తిరిగి పోలీసులపై విజయమ్మ దాడి చేశారని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు